అదానీ(Adani)పై కేసు అంశంపై ట్రంప్‌తో చర్చకు వచ్చిందాఅంటే ఇద్దరు దేశాధినేతలు చర్చించుకునే సమయంలో వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యత ఉండదన్న మోదీ సమాధానాన్ని రాహుల్ గాంధీ(Rahul Gandhi) తప్పుబట్టారు. అదానీపై కేసు ఎవరి వ్యక్తిగత అంశం కాదని, దేశప్రయోజనాలకు సంబంధించిన విషయమని రాహుల్ వ్యాఖ్యానించారు. ‘‘నరేంద్ర మోదీజీ(Modi).. అదానీది వ్యక్తిగత అంశంకాదు’’ అని రాయబరేలీలో నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ విమర్శించారు.
అదానీపై నమోదైన కేసు అంశంపై ట్రంప్‌తో భేటీ సమయంలో చర్చకు వచ్చిందా అన్న ప్రశ్నకు మోదీ బదులిస్తూ.. ‘‘భారత్ ఓ ప్రజాస్వామ్య దేశం. వసుదైక కుటుంబం అనేది మా సంస్కతి. ఇద్దరు దేశాధినేతలు ఎప్పుడూ వ్యతిగత స్థాయి అంశాలను చర్చించరు’’ అని అన్నారు. మోదీ ఇచ్చిన ఈ సమాధానాన్ని రాహుల్ గాంధీ(Rahul Gandhi) తీవ్రంగా తప్పుబట్టారు. మోదీపై ఘాటైన విమర్శలు చేశారు. ‘‘ఇదే అంశంపై దేశంలో ప్రశ్నిస్తే మౌనం దాల్చే ప్రధాని.. విదేశాల్లో దీనిని వ్యక్తిగత అంశమని బదులిస్తారు’’ అని అన్నారు.