కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి కోర్టుల్లో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. పరువునష్టం కేసులో తనకు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్(Surat) కోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలన్న పిటిషన్ ను సెషన్స్ కోర్టు కొట్టివేసింది. దీంతో రాహుల్ కు మరోసారి నిరాశే మిగిలింది. అయితే సెషన్స్ కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.
కాగా 2019 ఎన్నికల ప్రచారంలో మోదీ(Modi) ఇంటిపేరు ఉన్న వారందరూ దొంగలే అని రాహుల్(Rahul Gandhi) వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ నేత సూరత్ కోర్టులో పరువునష్టం కేసు వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రాహుల్ ను దోషిగా నిర్ధారిస్తూ రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన ఎంపీగా అనర్హత సాధించారు. అనర్హత వేటు పడడంతో ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను కూడా ఆయన ఖాళీ చేశారు.
2013లో వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏ ఎంపీ లేదా ఎమ్మెల్యే అయినా దోషిగా నిర్థారించబడి రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు జైలు శిక్ష పడితే ఆ పదవికి అనర్హులు అవుతారు.
Read Also: అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో సునీత పిటిషన్
Follow us on: Google News, Koo, Twitter