కోపంతో ఊగిపోయిన రాజస్థాన్ సీఎం.. మైక్‌ను నేలకేసి కొట్టిన గెహ్లాట్

-

కాంగ్రెస్ అగ్రనేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) తీవ్ర అసహనానికి గురయ్యారు. మహిళలతో నిర్వహిస్తున్న ఓ కార్యక్రమంలో మైక్ సక్రమంగా పని చేయకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయి మైక్‌ను నేలకేసి కొట్టారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలపై సమీక్షించేందుకు సీఎం గెహ్లాట్.. బర్మర్ జిల్లాలో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

- Advertisement -

మహిళలతో మాట్లాడేందుకు గెహ్లాట్(Ashok Gehlot) ప్రయత్నించినపుడు ఆయన చేతిలో ఉన్న మైక్ పని చేయలేదు. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఆయన ఎడమవైపునకు ఆ మైక్‌ను విసిరేశారు. అనంతరం కలెక్టర్ మరో మైక్‌ను గెహ్లాట్‌కు ఇచ్చారు. అయితే గెహ్లాట్ కలెక్టర్‌పైకి మైక్‌ను విసిరికొట్టారంటూ జరుగుతున్ ప్రచారాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం తీవ్రంగా ఖండించింది. మైక్‌ను కలెక్టర్‌పైకి విసరలేదని.. పక్కన వేశారని వివరణ ఇచ్చింది.

Read Also:
1. అమెరికాలో తెలుగు విద్యార్థి సజీవదహనం 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sathya Sai District | ఏపీలో ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి… సైనైడ్ కారణమా?

ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలో(Sathya Sai District) దారుణ ఘటన చోటు...

HCU Land Dispute | ‘భూమి బదిలీకి HCU అంగీకరించలేదు’

HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024...