రాజస్థాన్ మంత్రి వర్గం నుండి రాజేంద్ర సింగ్ గుద(Rajendra Singh Gudha) ను తొలగిస్తా సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం అసెంబ్లీ లో మణిపూర్ అల్లర్లపై, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే లు ప్లకార్డ్స్ తో నిరసన వ్యక్తం చేశారు. అదే సందర్భంలో హోమ్ గార్డ్, పౌర రక్షణ, పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి రాజేంద్ర మాటాడుతూ… రాష్ట్రంలో మహిళకు రక్షణ కరువైందని.. భద్రత కల్పించడంలో మన ప్రభుత్వం విఫలమైందని.. అఘాయిత్యాలు పెరిగాయని అన్నారు. దేశంలోనే మహిళలకు రక్షణ కల్పించడంలో రాజస్థాన్ మొదటి స్థానంలో నిలిచిందని సొంత ప్రభుతాన్నే ప్రశ్నించారు.
మణిపూర్ లో మహిళలపై జరిగే ఘటనలను లేవనెత్తే ముందు ఒకసారి మనమంతా ఆత్మా పరిశీలన చేసుకోవాలని రాజేంద్ర సింగ్ సొంత పార్టీ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. రాజేంద్ర తీరు పై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్(Ashok Gehlot), వెంటనే అతనిని మంత్రివర్గం నుండి తొలగించేందుకు గవర్నర్ కల్రాజ్ మిశ్ర కు సిఫారసు చేయడంతో వెంటనే తొలగించడం జరిగింది.
బర్తరఫ్ తర్వాత రాజేంద్ర సింగ్(Rajendra Singh Gudha) మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలని వెల్లడించానని… తానెప్పుడూ నిజాలనే చెప్తానని అన్నారు. సత్యం మాట్లాడినందుకు తనకు ఈ శిక్ష విధించారని పేర్కొన్నారు.
Read Also: కుమారుడి పొలిటికల్ ఎంట్రీపై గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat