ఆర్బీఐ మాజీ గవర్నర్ వెంకటరమణన్ కన్నుమూత 

-

భారతీయ రిజర్వ్ బ్యాంక్(RBI) మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్థికవేత్త ఎస్.వెంకటరమణన్(92) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వెంకటరమణన్ 1931లో తమిళనాడులోని నాగర్ కోయిల్‌లో జన్మించారు.

- Advertisement -

1990 నుంచి 92 వరకు రెండేళ్ల పాటు ఆర్బీఐ 18వ గవర్నర్‌గా సేవలు అందించారు. అంతకుముందు 1985 నుంచి 1989 వరకు కేంద్రంలో ఆర్థికశాఖ కార్యదర్శిగా పనిచేశారు. అలాగే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగానూ వ్యవహరించారు. భారత ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో దివంగత ప్రధాని పీవీ సరసింహారావు నేతృత్వంలో ఆర్బీఐ గవర్నర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టారు. నిర్మాణాత్మక ఆలోచనలతో సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...