రూ.2000 నోట్ల ఉపసంహరణ నేపథ్యంలో రూ.500 నోట్లను కూడా ఆర్బీఐ ఉపసంహరించుకుంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ వార్తలపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్(RBI Governor Shaktikant) క్లారిటీ ఇచ్చారు. రూ.500 నోట్లను ఉపసంహరించుకోవడం, రూ.1000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టడం వంటి ఆలోచన తమకు లేదని స్పష్టత ఇచ్చింది. ఇలాంటి ఫేక్ వార్తలను స్ప్రెడ్ చేయవద్దని పౌరులకు ఆర్బీఐ గవర్నర్(RBI Governor) సూచించారు. ఇటీవల ఉపసంహరించుకున్న రూ.2000 నోట్లలో 50శాతం ఇప్పటికే బ్యాంకులకు చేరినట్లు వెల్లడించారు. వీటి విలువ రూ.1.80 లక్షల కోట్లుగా పేర్కొన్నారు. అంటే మొత్తం మీద వ్యవస్థలో రూ.3.62 లక్షల కోట్ల విలువ చేసే రూ.2,000 నోట్లు ఉన్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే నోట్లన్నీ దాదాపు 85శాతం డిపాజిట్ల రూపంలోనే వచ్చే అవకాశం ఉందన్నారు. మిగిలిన 15 శాతం నోట్లను బ్యాంకుల్లో మార్పిడి చేసుకున్నట్లు ఆయన తెలిపారు.