Delhi CM Rekha Gupta | ఎట్టకేలకు ఢిల్లీ సీఎం పీఠం ఎవరికీ దక్కనుందో అనే అంశానికి తెరపడింది. సీఎం రేసులో ఎన్నో పేర్లు వినిపించినప్పటికీ బీజేపీ అధిష్టానం రేఖా గుప్తాను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది. షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుండి ఎన్నికల్లో గెలిచి ఆమె మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. 27 ఏళ్ళ తర్వాత ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ.. తొలిసారి ఎమ్మెల్యే గా విజయం సాధించిన రేఖా గుప్తా కు పగ్గాలు అందించడం విశేషం.
ప్రస్తుతం ఆమె ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఇప్పటివరకు ముగ్గురు మహిళలు మాత్రమే ఢిల్లీ సీఎం పదవిని నిర్వర్తించారు. 1998 లో బీజేపీ తరపున 52 రోజులు సీఎం గా పని చేసారు. 1998, 2003, 2008 లో కాంగ్రెస్ నుండి షీలాదీక్షిత్, ఆ తర్వాత ఆప్ పార్టీ నుండి అతిషి మార్లెనా దాదాపు 5 నెలలు ముఖ్యమంత్రిగా పని చేసారు. రేఖా గుప్తా(Rekha Gupta) బీజేపీ లో అనేక పదవుల్లో పని చేసిన అనుభవం ఉంది.
2003 నుంచి 2004 వరకు బీజేవైఏం ఢిల్లీ కార్యదర్శి
2004 నుంచి 2006 వరకు బీజేవైఏం జాతీయ కార్యదర్శిగా
2007, 2012 లో ఢిల్లీలోని ఉత్తరి పితంపుర వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు.
2022లో షాలీమార్ బాగ్-బి నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందారు.
ఢిల్లీ నూతన సీఎం ప్రమాణస్వీకారానికి రాంలీలా మైదానం సిద్ధమైంది. గురువారం సీఎం ప్రమాణస్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12: 34 గంటల వరకు కొనసాగనుంది. లెఫ్టనెంట్ గవర్నర్ రేఖా గుప్తా చేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు.