Nirmala Sitharaman: అమెరికా పర్యటనలో నిర్మలా సీతారామన్‌ను విలేకరులు రూపాయి పనితీరుపై అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించారు. రూపాయి విలువ క్షీణించడం లేదని, అమెరికా డాలర్ బలపడుతోందని పేర్కొన్నారు. డాలర్ విలువ నిరంతరం పుంజుకుంటోందని, అందువల్ల అనేక దేశాల కరెన్సీలు దెబ్బతింటున్నాయని వివరించారు. రూపాయి విలువ మరింత పడకుండా భరత ఆర్‌బీఐ కృషి చేస్తోందని తెలిపారు. భారత రూపాయి ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీల కంటే మెరుగ్గా ఉందన్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా మాంద్యం పరిస్థితులు నెలకొన్నాయని.. దీనివల్లే ఇతర దేశాల కరెన్సీలతో పాటు భారత రూపాయి కూడా బలహీనపడుతోందని Nirmala Sitharaman వెల్లడించారు.
- Advertisement -