కెనడా ప్రధాని సంచలన వ్యాఖ్యలు.. మోదీతో జైశంకర్ కీలక భేటీ

-

ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. అతని హత్యలో భారత్ హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం తలెత్తింది. ఈ ఉద్రిక్తతల వేళ ప్రధాని నరేంద్ర మోదీతో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ బుధవారం భేటీ అయినట్లు సమాచారం. ఈ ఉదయం పార్లమెంట్ భవనంలో ప్రధానిని కలిసిన జైశంకర్.. వివాదం గురించి ఆయనకు వివరించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీంతో పాటు, ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు, కెనడాలో భారతీయల పరిస్థితిపై కూడా ఆయన మోదీకి నివేదించినట్లు సమాచారం.

- Advertisement -

కాగా, నిషేధిత ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ (కేటీఎఫ్) నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల పాత్ర ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తమ పార్లమెంట్ లో వ్యాఖ్యానించడం చర్చలకు దారి తీసింది. ఈ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ వివాదం ఇరుదేశాల మధ్య వివాదాలకు ఆజ్యం పోసింది. ట్రూడో వ్యాఖ్యల అనంతరం భారత దౌత్యవేత్తను కెనడా నుంచి బహి ష్కరించడంతో ఇక భారత్ – కెనడా బంధాలు పూర్తిగా చెడినట్లేనని భారత్ భావిస్తోంది. సోమవారం కెనడా ప్రధాని ట్రూడో పార్లమెంట్లో చేసిన ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా సంచలనం సృష్టించాయి. హర్దీప్ హత్యకు సంబంధించి తమ వద్ద పూర్తి ఇంటలిజెన్స్ సమాచారం ఉందని ట్రూడో పేర్కొన్నారు. నిజ్జర్ హత్య తమ దేశ సార్వభౌమత్వంపై జరిగిన దాడిగా కెనడా ప్రధాని అభివర్ణించారు.

కెనడాకు భారత్ గట్టి కౌంటర్..

ఈ పరిణామాలపై భారత్ తీవ్రంగానే స్పందించింది. మంగళవారం ఢిల్లీలోని కెనడా రాయబారి కెమెరూన్ మెకేకు సమన్లు జారీచేసింది. ఐదు రోజుల్లోగా తమ దేశం విడిచి వెళ్లాలని అల్టిమేటం జారీ చేసింది. దీంతో కెనడా తెంపరితనానికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్టయ్యింది. సీనియర్ కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది. సంబంధిత దౌత్యవేత్త ఐదు రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలని సూచించింది. ‘మన అంతర్గత వ్యవహారాలు, భారత వ్యతిరేక కార్యకలాపాల్లో కెనడా దౌత్యవేత్త జోక్యం ఎక్కువ కావడంతో భారత్ తీవ్రంగా పరిగణి స్తోంది’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YS Sharmila | అవినాష్‌ను అరెస్ట్ చేయాలి.. షర్మిల డిమాండ్

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న అంశంపై ఏపీ కాంగ్రెస్ వైఎస్...

Aadi Srinivas | కేసీఆర్ మాట తప్పినా.. రేవంత్ తప్పలేదు: ప్రభుత్వ విప్

వేములవాడ రాజ రాజేశ్వరి ఆలయ(Vemulawada Temple) అభివృద్ధి కోసం రూ.76కోట్ల నిధులు...