ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు(Sadhguru) జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనారోగ్యం నుంచి కోలుకోవడంతో ఆయనను ఆపోలో వైద్యులు డిశ్చా్ర్జ్ చేశారు. దీంతో ఆయన హుషారుగా బయటకు వస్తూ అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్లారు.
కాగా కొన్ని రోజులుగా తీవ్ర తలనొప్పితో ఇబ్బంది పడుతున్న జగ్గీ వాసుదేవ్‌కు ఇటీవల బ్రెయిన్ సర్జరీ నిర్వహించారు. ఆ సమయంలో కొంతకాలంగా సద్గురు తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నట్లు అపోలో ఆస్పత్రిలోని సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ వినీత్ సూరి వెల్లడించారు. మెదడులో బ్లీడింగ్, వాపు ఉన్నట్లు సీటీ స్కాన్‌లో వెల్లడైందని చెప్పారు. వెంటనే ఆయనను ఢిల్లీ అపోలో ఆస్పత్రికి తీసుకువచ్చి సర్జరీ చేసినట్లు చెప్పారు.
మరోవైపు బ్రెయిన్ సర్జరీ జరిగిన తర్వాత సద్గురు(Sadhguru) ఓ వీడియో విడుదల చేశారు. మొదడులో చిన్న వాపు ఉండటంతో సర్జరీ నిర్వహించారని.. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. దీంతో అనారోగ్యం నుంచి త్వరగా కోలుకుని ఆయన అభిమానులు ప్రార్థనలు చేశారు.
https://t.co/JbxVuuQcKt pic.twitter.com/964m4s81o5
— Sadhguru (@SadhguruJV) March 27, 2024