రూ.2 వేల నోట్ల ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ(RBI) ఇటీవల ప్రకటించడంతో ఈ నోట్లను మార్చుకునే విషయంలో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రూ.2 వేల నోట్ల(2000 Rupee Notes) మార్పిడిపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఆదివారం కీలక అప్ డేట్ ఇచ్చింది. ఈ నోట్లను మార్చుకోవడానికి బ్యాంకుల్లో ఎలాంటి పత్రాలు నింపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. నోట్ల మార్పిడికి ఎలాంటి గుర్తింపు పత్రాలు చూపించాల్సిన పని లేదని రూ.20 వేల వరకు బ్యాంకులో నేరుగా మార్చుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు ఇవాళ స్టేట్ బ్యాంక్ బ్రాంచీలకు మార్గదర్శకాలు విడుదల చేసింది. త్వరలో నిషేధించబోతున్న ఈ నోట్లను మార్చుకోవడానికి ఆధార్ కార్డు తో పాటు ఇతర ఫామ్స్ ను సమర్పించాలంటు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండటంతో ఎస్బీఐ(SBI) ఈ క్లారిటీ ఇచ్చింది. మరో వైపు ప్రజలు 2 వేల నోట్లను రూ.20 వేల వరకు ఒక రోజులో ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Read Also: వేసవిలో ఈ ఫుడ్స్ రోజువారీ డైట్ లో చేరిస్తే మంచి బెనిఫిట్స్
Follow us on: Google News, Koo, Twitter