కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తమ సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకుని కమలం పార్టీ కోసం పని చేస్తున్నారన్నారు. శుక్రవారం గుజరాత్‌లో(Gujarat) పర్యటించిన రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్బంగానే పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ.. కొందరు తిన్నింటి వాసాలు లెక్కబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కండువా కప్పుకుని కూడా బీజేపీ-బీ టీమ్‌గా కొందరు పనిచేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి నకిలీ నేతలకు బుద్ధి చెప్పాలని, లేకుంటే గుజరాత్ ప్రజల మనసును గెలుచుకోలేమని అన్నారు.
కాంగ్రెస్‌లో ఉంటూ బీజేపీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలను, నేలను గుర్తించాల్సిన అవసరం ఉందని, దీనిని యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. మన బాధ్యతలు నెరవేర్చేవరకు తమకు అధికారం ఇవ్వాలని ప్రజలను అడగొద్దని అన్నారు. అప్పటి వరకు ప్రజలు కూడా తమకు ఓటు వేయరని పేర్కొన్నారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).