ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగ్ రోజును దేశీయ స్టాక్ మార్కెట్(Stock Market) సూచీలు నష్టాల్లో ముగించాయి. సెన్సెక్స్ ఉదయం 77,690.69 పాయింట్ల వద్ద క్రితం ముగింపు 77,606.43 స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 77,185.62- 77,766.70 మధ్య కదలాడింది. చివరికి 191.51 పాయింట్లు నష్టంతో 77,414.92 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 72.60 పాయింట్ల నష్టంతో 23,519.35 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.48గా ఉంది. సెన్సెక్స్ 191 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 72 పాయింట్లు కోల్పోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలపై ప్రకటన చేయనున్న ఏప్రిల్ 2 వేళ మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.