అస్సాంలోని గువహతి(Guwahati)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గువహతిలోని జలక్‌బారీ ప్రాంతంలో ఆదివారం అర్థరాత్రి 1 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాంలోని గువహతి(Guwahati)లో జలక్‌బారీ ప్రాంతంలో 10 మంది ఇంజినీరింగ్ విద్యార్థులతో కలిసి వెళ్తున్న కారు వేగంగా దూసుకు వచ్చింది. దీంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న పికప్ వ్యాన్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా…మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి రెండు వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను ఇంజినీరింగ్ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. మద్యం తాగి వాహనం నడిపారా లేక నిద్రమత్తులో ప్రమాదం జరిగిందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్
మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...
Jaishankar | మోదీతో భేటీ అంత ఈజీ కాదు: జైశంకర్
ప్రధాని మోదీ(PM Modi)తో భేటీ కావడంపై భారత విదేశాంగ శాఖ మంత్రి...
Sanjiv Khanna | సీజేఐగా సంజీవ్ ఖన్నా ప్రమాణం..
భారతదేశ 51వ చీఫ్ జస్టిస్‌గా సంజీవ్ ఖన్నా(Sanjiv Khanna) ప్రమాణ స్వీకారం...
Latest news
Must read
Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్
మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...
Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్
కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...