దేశవ్యాప్తంగా ప్రముఖ టెలికామ్ దిగ్గజ సంస్థ ఎయిర్‌టెల్(Airtel ) సేవలకు తీవ్ర అంతరాయం నెలకొంది. శనివారం మధ్యాహ్నం నుంచి మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులు పనిచేయడం లేదు. ఒక్కసారిగా అన్ని సేవలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. అత్యవసరంగా కాల్స్ చేద్దాం అనుకున్నవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ఎయిర్‌టెల్ యాప్ కూడా పనిచేయడం లేదు. దీంతో ఎయిర్‌టెల్ కస్టమర్‌లు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ పనిచేయడం లేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దీంతో ట్విట్టర్లో ఎయిర్‌టెల్ డౌన్ హ్యాష్ ట్యాగ్ మార్మోగుతోంది. దీనిపై ఎయిర్‌టెల్(Airtel ) సంస్థ స్పందించింది. మా నెట్‌వర్క్ సేవలకు స్వల్ప అంతరాయం ఏర్పడిందని.. వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి తీవ్రంగా చింతిస్తున్నామని ట్వీట్ చేసింది. సమస్య త్వరగా పరిష్కారం అయ్యేందుకు తమ బృందాలు కష్టపడుతున్నాయని పేర్కొంది. కస్టమర్లకు కలిగిన ఇబ్బందికి క్షమాపణలు చెబుతున్నామని వెల్లడించింది. ఈ ఏడాది ఆరంభంలోనూ ఇటువంటి సమస్యే ఎదుర్కొన్నారు వినియోగదారులు.
Hyderabad impacted with Airtel Outage @airtelindia. All of my near and dear who use Airtel are facing network glitches including calls not connecting.
People are opting VOIP as back up for calling via social media@Airtel_Presence Please take care ASAP
— Irrfaan Abdul Azeem (@IrrfaanA) August 5, 2023
Is @airtelindia down in Bangalore? I am getting a message "No Service" contact your service provider. Airtel website also not working.
— S V Manjunath ?? (@imsvmanjunath) August 5, 2023