‘కెనడా నుండి వెళ్లిపోండి’.. హిందువులకు వేర్పాటువాది వార్నింగ్

-

కెనడా- భారత్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ నివసిస్తున్న భారతీయులను కలవర పెడుతున్నాయి. నిషేధిత సంస్థలకు చెందిన నేతల బెదిరింపు ప్రకటనలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. కెనడాలో నివసిస్తున్న హిందువులు దేశం విడిచి వెళ్లిపోవాలని హెచ్చరించడం కలకలం రేపింది.

- Advertisement -

‘కెనడా వ్యతిరేక చర్యలకు పాల్పడుతోన్న కొంతమంది ఇండో- హిందువులు.. కెనడా పట్ల నిబద్ధతను చాటడం లేదు. కెనడా నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నప్పటికీ.. భారత్ కి మద్దతు పలుకుతున్నారు. ఏ దేశ ప్రయోజనాలు, రక్షణ కోసం ఆసక్తి చూపుతున్నారో అటువంటి వారు తిరిగి భారత్ కి వెళ్లాలి’ అని గురుపత్వంత్ పన్నూ వార్నింగ్ ఇస్తున్నట్టు ఉన్న ఓ వీడియో వైరల్ అయింది. హర్దీప్ సింగ్ నిజ్జర్ మృతిని కొందరు వేడుక చేసుకున్నారని ఆరోపించిన అతడు.. ఖలిస్థానీ వ్యతిరేక శక్తులకు కెనడాలో చోటు లేదన్నాడు. ఈ బెదిరింపులపై కెనడాలోని హిందూ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

సిఖ్ ఫర్ జస్టిస్ (SFJ) అనే వేర్పాటువాద సంస్థను భారత్ 2019లోనే నిషేధించింది. 2007లో ఈ సంస్థను స్థాపించగా.. వ్యవస్థాపకుల్లో గురుపత్వంత్ సింగ్ పన్ను కూడా ఒకడు. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం (UAPA) కింద భారత ప్రభుత్వం అతడిని 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. తాజాగా కెనడాలో జరుగుతోన్న పరిణామాలపై పన్నూ స్పందించాడు. కెనడా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇండో- కెనడియన్ హిందువులు వ్యవహరిస్తున్నారని ఆరోపించిన అతడు.. అటువంటి వారు తిరిగి భారత్ వెళ్లిపోవాలని బెదిరించాడు.

ఈ బెదిరింపులు ఆందోళనకరం..

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న వేళ.. హిందువులపై బెదిరింపులకు పాల్పడటంపై అధికార పార్టీ సభ్యులే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో దేశంలోని హిందువులను లక్ష్యంగా చేసుకోవడంపై అధికార పార్టీ చట్టసభ సభ్యుడు చంద్ర ఆర్య విస్మయం వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులతో హిందూ కెనడియన్లు తీవ్ర భయాందోళనకు గురవుతున్నట్లు తనకు తెలిసిందన్నారు. ఇటువంటి సమయంలో సంయమనంతో ఉండాలని కెనడా హిందువులకు విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

విశాఖ ఫైల్స్ రిలీజ్ ఎప్పుడో చెప్పిన ఎమ్మెల్యే గంటా

Visakha Files | విశాఖ నగరంలో వైసీపీ భారీ స్థాయిలో భూదందాలకు...

37 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసిన ఏపీ సర్కార్

Andhra Pradesh government transfers 37 IPS officers | ఆంధ్రప్రదేశ్...