ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది కర్ణాటకలో రాజకీయం వేడెక్కుతోంది. శరద్ పవార్(Sharad Pawar) నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 40- నుంచి 45 స్థానాల్లో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో మరాఠీ మాట్లాడే ప్రాంతాల్లో తమ అభ్యర్థులను బరిలో దించాలనుకుంటోంది. దీనిపై ఏప్రిల్ 15న ముంబైలో పార్టీ నేతలు సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవల ఎన్సీపీ జాతీయ హోదా కోల్పోయిన క్రమంలో జాతీయ పార్టీ హోదాను తిరిగి పొందే వ్యూహంలో భాగంగా ఎన్సీపీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కర్ణాటకలో అధికార బీజేపీకి కాంగ్రెస్, జేడీ(ఎస్) మధ్య గట్టి పోటీ నెలకొంది. బీజేపీని అధికారం నుంచి తప్పించాలని, జేడీ(ఎస్)ని కింగ్ మేకర్‌గా ఎదగకుండా చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
Read Also: అధికారిక నివాసం ఖాళీ చేసిన రాహుల్ గాంధీ.. ట్రక్కుల్లో వస్తువుల తరలింపు
Follow us on: Google News, Koo, Twitter