దేశ రాజధాని ఢిల్లీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్(Shashi Tharoor) కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ రాజధాని స్థాయిలో ఢిల్లీ ఇంకా కొనసాగాలా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఆయన చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఢిల్లీలో గాలి కాలుష్యం(Delhi Air Pollution) రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో శశిథరూర్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశరాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేస్తోంది. కొన్ని మీటర్ల దూరంలోని వాహనాలు కూడా కనిపించని స్థాయిలో గాలి నాణ్యత క్షీణిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశ రాజధానిగా ఢిల్లీ కొనసాగాల్సి ఉందా అని ప్రశ్నించారాయన. ఈ ప్రశ్నతో పాటు ప్రపంచంలోని కాలుష్య నగరాల జాబితా గణాంకాలను ఆయన షేర్ చేశారు.
‘‘ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారింది. ఇక్కడ గాలిలో ప్రమాదకర కాలుష్య కారకాలు నాలుగు రెట్లు అధికమయ్యాయి. రెండో అత్యంత కాలుష్య నగరంగా పాకిస్థాన్ రాజధాని ఢాకా నిలిచింది. ఈ రెండి మధ్య వ్యత్యాసం చూసినా ఢిల్లీలో ఢాకా కన్నా ఐదు రెట్లు ఎక్కువ కాలుష్యం ఉంది. ఇటువంటి విపత్కర పరిస్థితులు రావడం ఇదేమీ తొలిసారి కాదు. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిని ఏమాత్రం పట్టించుకోలేదు. నవంబర్ ప్రారంభం నుంచి జనవరి మధ్య వరకు కూడా ఢిల్లీ అంటే ఏదో విషయ కుంపటే గుర్తొస్తుంది తప్ప నివాస యోగ్యమైన నగరం గుర్తుకు రావట్లేదు. మిగిలిన సమాయాల్లో కూడా ఇక్కడ జీవనం అంతంతమాత్రంగానే కొనసాగించగలం. ఇలాంటి స్థితుల్లో ఢిల్లీని ఇంకా దేశ రాజధానిగా కొనసాగించాలి’’ అని శశిథరూర్(Shashi Tharoor) పోస్ట్ చేశారు.