కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) అస్వస్థతకు గురయ్యారు. దీంతో శుక్రవారం ఉదయం ఆమెని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో(Sir Ganga Ram Hospital) చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి వైద్య బృందం ఆమెని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది డిసెంబరు నెలలో సోనియా 78వ పడిలో ప్రవేశించారు.