విమానాలకు బాంబు బెదిరింపుల ఘటనలు అధికమవుతున్నాయి. ఇటీవల 24 గంటల్లో 20కిపైగా బెదిరింపులు వచ్చాయి. వెంటనే అలెర్ట్ అయిన పోలీసులు పలు విమానాల టేకాఫ్‌లను నిలిపేసి మరీ తనిఖీలు చేశారు. ఏమీ లభించకపోవడంతో వీటిని ఆకతాయిల చర్యగా తీసుకున్నారు. తాజాగా ఇదే అంశంపై కేంద్ర ఏవియేషన్ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu) ఘాటుగా స్పందించారు. ఇకమీదట ఇటువంటి బెదిరింపులను తాము తేలికగా తీసుకోమని, చేసిన వారిని వెతికి పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటువంటి వారికి విమానాల్లో ప్రయాణించే వీలు లేకుండా ‘నో ఫ్లై లిస్ట్’లో వారి పేరును చేరుస్తామని తెలిపారు. ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ లేకుండా చర్యలు తీసుకుంటామని, ఎటువంటి సమస్యనైనా పరిష్కరించేలా ముందడుగు వేస్తామని రామ్మోహన్‌నాయుడు వెల్లడించారు.
‘‘పౌరవిమానాయన భద్రతకు ప్రమాదం కలిగించే చట్టవిరుద్ధ చర్యల అణచివేత చట్టం-1982లో పలు సవరణలను ప్రతిపాదించనున్నాం. తద్వారా విమానం గ్రౌండ్‌లో ఉన్నప్పుడు చేసే ఇలాంటి తప్పులకు నిందితులను కోర్టు ఉత్తర్వులు లేకుండా అరెస్ట్ చేసే నేరాలుగా పనిగణించడానికి వీలు కలుగుతుంది. కఠిన శిక్షలు, జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది. ఇటీవల వరుసగా విమానాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఒక్క వారంలోనే 100కుపైగా విమానాలకు బెదిరింపులు వచ్చాయి. ఇవి చాలా వరకు సోషల్ మీడియా ద్వారానే వస్తున్నాయి’’ అని తెలిపారు.
‘‘చట్టంలో మార్పు తీసుకురానున్నాం. వీటిని శాఖ లీగల్ సెల్ బృందంపై చూసుకుంటుంది. దీనిపై ఇతర శాఖలతో సంప్రదింపులు జరపాల్సి ఉంది. కఠిన చర్యలు తీసుకునేలా చట్టంలో మార్పులు తీసుకురావడం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాం. దీంతో పాటుగా ప్రాంతీయ వైమానిక సంధానతకు ఉద్దేశించిన ‘ఉడాన్’ పథకాన్ని మరో 10 ఏళ్ల పాటు పొడిగించాలని నిర్ణయించాం. ఈ పథకం వల్ల ప్రాంతీయ విమానాయన సంస్థలు, కొత్త ఉద్యోగాలు వచ్చాయి’’ అని ఆయన(Ram Mohan Naidu) చెప్పారు.
Read Also: తండ్రైన సర్ఫరాజ్.. పండిబిడ్డకు బిడ్డకు జన్మనిచ్చిన క్రికెటర్ భార్య