ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలన ట్విస్ట్ చోటుచేసుకుంది. మనీలాండరింగ్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్(Sukesh Chandrasekhar) సంచలన లేఖను విడుదల చేశారు. తీహార్ జైలు నుంచి సుఖేష్ చంద్రశేఖర్ శుక్రవారం లేఖ రాశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పినట్టు బీఆర్ఎస్(BRS)కు రూ.75 కోట్లు ఇచ్చానన్నారు. మొత్తం 15 కోట్ల చొప్పున ఐదుసార్లు రూ.75 కోట్లు పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌తో తాను మొత్తం 700 పేజీల వాట్సాప్, టెలిగ్రామ్ చాట్‌లు చేసినట్లుగా వెల్లడించారు. కేజ్రీవాల్ తరపున 2020లో బీఆర్‌ఎస్ ఆఫీసులో రూ.75 కోట్లు ఇచ్చానని వెల్లడించాడు. ఈ ఆపరేషన్ కోడ్ వర్డ్ 15 కిలోల నెయ్యి అని సుఖేశ్ చంద్రశేఖర్ తెలిపాడు.
ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తికే ఈ మొత్తాన్ని అందజేశానన్నాడు. కేజ్రీవాల్‌తో జరిపిన వాట్సాప్, టెలీగ్రాఫ్ చాట్‌లు 700 పేజీలు తన వద్ద ఉన్నాయని చెప్పాడు. కేజ్రీవాల్, బీఆర్‌ఎస్‌పై ఆరోపణలతో కూడిన లేఖను తన లాయర్ అనంత్ మాలిక్ ద్వారా సుఖేశ్ బయట పెట్టాడు. కేజ్రీవాల్(Arvind Kejriwal) ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని భారత్ రాష్ట్ర సమితి కార్యాలయంలో రూ.75 కోట్లు అందజేసినట్లు లేఖలో వెల్లడించాడు. బీఆర్‌ఎస్ కార్యాలయం లోపల పార్క్ చేసిన రేంజ్ రోవర్‌లో ఉన్న ‘ ఏపీ’ అనే వ్యక్తికి రూ.75 కోట్లు అందించినట్లు లేఖలో పేర్కొన్నాడు. ‘ ఏపీ’ కూర్చున్న రేంజ్ రోవర్ కారు నెంబర్ 6060గా లేఖలో పేర్కొన్నాడు. కాగా, సీబీఐ, ఈడీ కేసుల నుంచి విముక్తి కలిగిస్తానంటూ పలువురి వ్యాపారవేత్తల్ని మోసం చేసిన కేసులో సుఖేశ్ చంద్రశేఖర్(Sukesh Chandrasekhar) తీహార్ జైల్లో ఉన్నాడు.
Read Also: ఒక్కరిని కూడా వదిలిపెట్టను.. బెంగాల్ సీఎం సంచలన వ్యాఖ్యలు
Follow us on: Google News, Koo, Twitter