మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్(Sukesh Chandrasekhar) మరో సంచలన లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)తో పాటు కొంతమంది బీఆర్ఎస్ నేతల పేర్లు పలుమార్లు ప్రస్తావించారు. అరుణ్ రామచంద్ర పిళ్లయ్‌కే డబ్బులు ఇచ్చానని సుఖేశ్(Sukesh Chandrasekhar) లేఖలో పేర్కొన్నారు. గతంలో ఏపీ అనే షార్ట్ నేమ్ ఉన్న వ్యక్తికి డబ్బులు ఇచ్చానని సుఖేశ్ చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా.. ఏపీ అరుణ్ పిళ్లయ్(Arun Pillai) అంటూ లేఖ రాసి కుండబద్దలు కొట్టారు. ఇక ఎమ్మెల్సీ స్టిక్కర్ ఉన్న ఒక రేంజ్ రోవర్ కారులో వ్యక్తికి డబ్బులు ఇచ్చినట్లు సురేశ్ లేఖలో పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి అవసరమైతే నార్కోటెస్ట్‌కు కూడా తాను సిద్ధమంటూ స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్‌కు సౌత్ గ్రూప్‌కు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయనే విషయాన్ని బలపరుస్తోందనే టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
Read Also: టెన్త్ పేపర్ లీక్ కేసులో MLA ఈటలకు షాక్!
Follow us on: Google News, Koo, Twitter