Supreme Court | లైసెన్స్ విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు

-

వాణిజ్య, రవాణా వాహన డ్రైవర్లకు భారీ ఉపశమనం కల్పించింది సుప్రీంకోర్టు(Supreme Court). సాధారణ డ్రైవింగ్ లైసెన్స్‌తో కూడా కమర్షియల్ వాహనాలను నడపొచ్చని స్పష్టం చేసింది. లైట్ వెయిట్ మోటర్ వెహికల్(LMV) లైసెన్స్‌తో గరిష్ఠంగా 7.5 టన్నుల బరువు ఉన్న రవాణా వాహనాలను నడపవచ్చని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అయితే ఇన్నాళ్లూ కూడా వాణిజ్య వాహనాలను నడపడం కోసం సంబంధిత అధికారుల నుంచి అదనపు లైసెన్స్ పొందాల్సి ఉంది. కానీ ఇకపై ఆ అవసరం లేదని సుప్రీకోర్టు సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యంగ ధర్మాసనం వెల్లడించింది. చిన్నచిన్న వ్యాపారులు, ఆటోలు, క్యాబ్‌లు నడిపేవారు ఎల్ఎంవీ లైసెన్స్‌తో 7,500 కిలోల వరకు బరువు ఉన్న వాహనాలను నడపొచ్చని తెలిపింది ధర్మాసనం. కాగా ఈ నియమం ప్రమాదకర సరుకులను తీసుకెళ్లే వాహనాలకు వర్తించదని వెల్లడించారు.

- Advertisement -

ముకుంద్ దేవాంగన్ వర్సెస్ ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కేసు దర్యాప్లు అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. ఈ కేసులో త్రిసభ్య ధర్మాసనం 2017లో ఇచ్చిన తీర్పును తాజాగా విచారించిన ఐదుగు సభ్యుల ధర్మాసనం సమర్థించింది. 7,500 కిలోోల బరువును మించని ఖాళీ రావాణా వాహనాలను ఎల్ఎంవీ పరిధి నుంచి మినహాయిచొద్దని న్యాయస్థానం 2017లో తీర్పిచ్చింది. ఈ తీర్పు వల్ల తమపై నష్టపరిహార చెల్లింపు భారం పెరుగుతుందని భావించిన బీమా కంపెనీలు త్రిసభ్య ధర్మాసనం తీర్పును ఛాలెంజ్ చేస్తూ 76 పిటిషన్లు దాఖలు చేశాయి. ఎల్ఎంవీ లైసెన్స్ ఉన్న వ్యక్తి 7.5టన్నుల బరువున్న వాహనాన్ని నడపొచ్చా? అలా నడుపుతూ ప్రమాదం జరిగితే వాళ్లు ఇన్సూరెన్స్ కోసం అప్లై చేసుకోవచ్చా? అన్న అంశాలపై చంద్రచూడ్(CJI Chandrachud) నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిగింది. ఈ విచారణలో ఇన్సూరెన్స్ సంస్థల వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. ఎల్‌ఎంవీ లైసెన్స్ ఉన్న వారు 7.5 టన్నుల వరకు బరువు ఉన్న వాహనాలను నడపొచ్చని Supreme Court తేల్చి చెప్పింది.

Read Also: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. స్పిరట్ పట్టాలెక్కేదప్పుడే..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...