థియేటర్లలోకి బయటి ఫుడ్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

-

Supreme Court States Theatres Can Prohibit Outside Food but Must Provide Hygienic Drinking Water Free of Cost: సినిమా థియేటర్లలోకి బయట నుంచి ఫుడ్ అనుమతించాలా లేదా అనే అంశంపై మంగళవారం సుప్రీంకోర్టు లో విచారణ జరిగింది. దీనిపై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహలతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ సంచలన తీర్పు వెలువరించింది. సినిమా హాల్స్ లోనికి బయటి నుంచి ఆహారం, పానీయాలు తీసుకురాకుండా నియంత్రించే హక్కు థియేటర్ యజమానులకు ఉంటుందని తేల్చి చెప్పింది. సినిమా థియేటర్లు యజమానుల ప్రైవేట్ ఆస్తులని.. అందువల్ల ప్రేక్షకులు బయట నుంచి థియేటర్లలోకి స్నాక్స్, కూల్ డ్రింక్స్ తీసుకురాకుండా నియంత్రించే హక్కు వారికి ఉంటుందని స్పష్టం చేసింది ధర్మాసనం. థియేటర్ లోపల ఉన్న వాటిని కొనుగులు చేయాలా వద్దా అనేది ప్రేక్షకుడి నిర్ణయం అని, ఈ విషయంలో బలవంతం చేయకూడదని సూచించింది.

- Advertisement -

ప్రేక్షకులు సినిమా థియేటర్లలోకి స్నాక్స్, కూల్ డ్రింక్స్ తీసుకువెళ్లకుండా అడ్డుకోవద్దని మల్టీప్లెక్స్ లు, సినిమా హాళ్లకు జమ్ము కశ్మీర్ హైకోర్టు 2018లో ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ థియేటర్ యజమానులు, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు(Supreme Court) ధర్మాసనం జమ్ముకశ్మీర్ హైకోర్టు ఆదేశాలను రద్దు చేసింది. అందుబాటులో ఉన్న స్నాక్స్, కూల్ డ్రింక్స్ కొనుగోలు చేయాలా? వద్దా? అనేది ప్రేక్షకుడి ఇష్టం అని, హాల్లో కచ్చితంగా తినుబండారాలు కొనాలన్న నిబంధనేమీ లేదు కాబట్టి ప్రేక్షకులు అవసరమైతేనే స్నాక్స్ కొనుగోలు చేస్తారని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇదే సమయంలో థియేటర్లలో  ఉచిత మంచినీరు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. ఈ విషయంలో జమ్ము కశ్మీర్ హైకోర్టు తన పరిధి దాటిందని పేర్కొంది.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...