జాకీర్ హుస్సేన్(Zakir Hussain).. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తబలా విధ్వంసుడు(Tabla Maestro). కొంతకాలంగా రక్తపోటు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. రెండు వారాల క్రితం ఆరోగ్య సమస్యలతో శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో చేరారాయన. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు వైద్యులు.
ఈ క్రమంలోనే ఈరోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయన తన కళతో ప్రపంచ హృదయాన్ని గెలిచారు. ఆయన మరణ వార్త సంగీత ప్రపంచాన్ని కుదిపేసింది. ఆయన మరణంపై ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటుని విచారం వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తమల మ్యాస్ట్రో జాకీర్ హుస్సేస్(Zakir Hussain).. 9 మార్చి 1951న ముంబైలో జన్మించారు. ప్రముఖ తబలా వాయిద్యకారుడు అల్లారఖా పెద్ద కుమారుడైన జాకీర్.. తన తండ్రి బాటలోనే నడిచారు. హిందుస్థానీ క్లాసికల్, జాజ్ ఫ్యూజన్‌లో నైపుణ్యం సాధించి అందులో తనదైన ముద్ర చూపించారు.
తొలుత ఆదివారం రాత్రి సమయంలోనే జాకీర్ తుదిశ్వాస విడిచారని వార్తలు వచ్చాయి. కానీ ఆయన మరణించలేదని, పరిస్థితి మరింత విషమించడంతో చికిత్స పొందుతున్నారని కుటుంబీకులు తెలిపారు. కాగా సోమవారం తెల్లవారుజామున ఆయన కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు.