Taj Mahal: వింత నోటీసులు అందుకున్న తాజ్ మహల్

-

Taj Mahal Gets Property, Water Tax Notices: ప్రపంచ కట్టడాల్లో ఒకటైన అద్భుత కట్టడం తాజ్ మహల్ కు ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్ వారు వింత నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసుల్లో తాజ్ మహల్ ప్రాపర్టీ టాక్స్, వాటర్ టాక్స్ చెల్లించాలని కోరింది. 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబందించి 1.9 కోట్లు వాటర్ టాక్స్, 1.5 లక్షల ప్రాపర్టీ టాక్స్ చెల్లించాలని ఆర్కియోలాజికల్ సర్వే అఫ్ ఇండియా(ASI) కు నోటీసు లో పేర్కొన్నారు.

- Advertisement -

బకాయిలను చెల్లించడానికి 15 రోజుల  ఇస్తూ.. నిర్ణిత గడువులోగా చెల్లించని పక్షంలో తాజ్ మహల్(Taj Mahal) ఆస్తి జప్తు చేయనున్నట్లు ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్ పేర్కొంది.  ASI సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ రాజ్ కుమార్ పటేల్ మాట్లాడుతూ.. స్మారక కట్టడాలపై ఆస్తి పన్ను వర్తించదని అన్నారు.ఫస్ట్ టైం ప్రాపర్టీ టాక్స్, వాటర్ టాక్స్ ను పొందామని… నీటిని వాణిజ్య పరమైన ఉపయోగానికి వినియోగించడం లేదని, కేవలం ప్రాంగణంలోని పచ్చదనం కోసం మాత్రమే వాడుతున్నట్లు తెలిపారు. పొరపాటున ఈ టాక్స్ లు పడినట్లు వారు భావించారు.

తాజ్ మహల్ కి అందిన నోటీసుల పై వివరణ ఇచ్చిన ఆగ్రా మున్సిపల్ కమిషనర్ నిఖిల్ టీ ఫండే. తాజ్ మహల్ కు  సంబంధించిన పన్ను సంబంధిత ప్రక్రియల గురించి తనకు తెలియదన్నారు. పన్నుల లెక్క కోసం రాష్ట్ర వ్యాప్తంగా  జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (GIS) చేసిన  సర్వే ఆధారంగా తాజా నోటీసులు జారీ చేయబడినట్లు తెలిపారు. అన్ని ప్రాంగణాలు, సహా ప్రభుత్వ భవనాలు మరియు మతపరమైన ప్రదేశాలు, వాటిపై పెండింగ్‌లో ఉన్న బకాయిల ఆధారంగా నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించి రాయితీ అందించబడుతుందని  అన్నారు. ASIకి నోటీసులు జారీ చేసిన సందర్భంలో, వారి నుండి వచ్చిన ప్రతిస్పందన ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు

తాజ్ మహల్‌పై నీరు, ఆస్తి పన్ను కోసం జారీ చేసిన నోటీసులకు సంబంధించిన అంశంపై  దర్యాప్తు జరుగుతున్నట్లు అసిస్టెంట్ మునిసిపల్ కమిషనర్, తాజ్‌గంజ్ జోన్ ఇన్‌చార్జి సరితా సింగ్ వెల్లడించారు. 1920లో తాజ్‌మహల్‌ను రక్షిత స్మారక చిహ్నంగా ప్రకటించారని, బ్రిటీష్ హయాంలో కూడా ఈ స్మారక చిహ్నంపై ఇంటి పన్ను, నీటి పన్ను విధించలేదని ఏఎస్‌ఐ అధికారులు తెలిపారు.

Read Also: అపాన ముద్రతో ఆ సమస్యలన్నింటికీ చెక్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

High BP | హైబీపీ రాకూడదంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

ప్రస్తుత పోటీ ప్రపంచంలో చిన్న వయసులోనే అనేక రకాల రుగ్మతలు వస్తున్నాయి....

Director Shankar | నెగిటివ్ రివ్యూలకే అవే సమాధానం చెప్తాయి: శంకర్

సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్(Director Shankar) ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా పనుల్లో...