తమిళనాడు(Tamil Nadu) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో విపక్షాల ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే తమిళనాడులో ‘నీట్’ పరీక్షను తీసేస్తామని సంచలన ప్రకటన చేశాడు. నీట్ పరీక్ష రద్దు కోసం డీఎంకే చేస్తున్న పోరాటం రాజకీయ అభ్యర్థన కాదని, సామాజిక సమానత్వ విద్య కోరుకునే తమిళనాడు ప్రజల డిమాండ్ అని తెలిపారు. నిరాహారదీక్షలను విజయవంతం చేసినవారందరికీ అభినందనలు తెలిపారు.
Tamil Nadu | చెన్నైలో నిరాహారదీక్షకు మంత్రి ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) నేతృత్వం వహించారు. సాయంత్రం దీక్ష విరమించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎంతోమంది ప్రాణాలు తీస్తున్న నీట్ ప్రవేశ పరీక్షను రద్దు చేయాలని, లేదా రాష్ట్రానికి మినహాయింపునివ్వాలని కోరుతూ ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేద్దామని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి ఆయన విజ్ఞప్తి చేశారు.