Tata Motors subsidiary signs deal with BMTC to supply 921 electric buses: టాటా స్టార్‌బస్ ఎలక్ట్రిక్ సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఉన్నతమైన డిజైన్, ఉత్తమ-తరగతి ఫీచర్లను అందిస్తుంది. తన పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ TML స్మార్ట్ సిటీ మొబిలిటీ సొల్యూషన్స్ లిమిటెడ్‌తో బెంగళూరు నగరంలో 921 ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కోసం ఒక డెఫినిటివ్ ఒప్పందంపై బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (BMTC) సంతకం చేసినట్లు భారతదేశంలోని అతిపెద్ద వాణిజ్య వాహనాల తయారీ సంస్థ టాటా మోటార్స్, ఈరోజు ప్రకటించింది. ఒప్పందంలో భాగంగా, TML స్మార్ట్ సిటీ మొబిలిటీ సొల్యూషన్స్ లిమిటెడ్ 12 సంవత్సరాల కాలానికి 921 యూనిట్ల 12 మీటర్ల లో-ఫ్లోర్ ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేస్తుంది, ఆపరేట్ చేస్తుంది, నిర్వహిస్తుంది. టాటా స్టార్‌బస్ ఎలక్ట్రిక్ అనేది సుస్థిరమైన, సౌకర్యవంతమైన ప్రయాణానికి అత్యుత్తమ డిజైన్,అత్యుత్తమ-తరగతి ఫీచర్లతో దేశీయంగా అభివృద్ధి చేయబడిన వాహనం.
ఈ ప్రకటనపై బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి జి సత్యవతి మాట్లాడుతూ.. “బెంగళూరులో 921 ఎలక్ట్రిక్ బస్సులను నడపడానికి TML స్మార్ట్ సిటీ మొబిలిటీ సొల్యూషన్స్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చు కున్నందుకు మేం సంతోషిస్తున్నాం. జీరో-ఎమిషన్, ఎకో-ఫ్రెండ్లీ బస్సుల ప్రవేశం అందరికీ ప్రయోజనం చేకూరుస్తుందని, వాయు కాలుష్యాన్ని అరికట్టడంలో సహాయపడుతుందని మేం విశ్వసిస్తున్నాం. ఎలక్ట్రిక్ మొబిలిటీ డొమైన్‌లో టాటా మోటార్స్ విస్తృత అనుభవం నగరంలో నిరంతరాయంగా, సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడంలో కచ్చితంగా సహాయపడు తుంది’’ అని అన్నారు.
ఈ సందర్భంగా TML స్మార్ట్ సిటీ మొబిలిటీ సొల్యూషన్స్ లిమిటెడ్ సీఈఓ, ఎండీ, శ్రీ అసిమ్ కుమార్ ముఖోపాధ్యాయ మాట్లా డుతూ, “మేం భారీ CESL టెండర్ క్రింద మొదటి డెఫినిటివ్ ఒప్పందంపై సంతకం చేయడం మాకు చాలా ముఖ్యమైన సందర్భం. బెంగుళూరు నగరంలో ప్రజా రవాణాను ఆధునికీకరించడానికి, విద్యుదీకరించడానికి బీఎంటీసీ వారి ప్రయత్నంలో ఈ భాగస్వా మ్యానికి సంతోషిస్తున్నాం. టాటా మోటార్స్ లో మేం స్మార్ట్, గ్రీన్, ఎనర్జీ ఎఫెక్టివ్ మాస్ మొబిలిటీ సొల్యూషన్‌లను అభివృద్ధి చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తాం. ఎలక్ట్రిక్ బస్సులు బెంగళూరు ప్రయాణికులకు స్థిరమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రజా రవాణాను అందిస్తాయని మేం విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు.
టాటా మోటార్స్ అత్యాధునిక పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు బ్యాటరీ-ఎలక్ట్రిక్, హైబ్రిడ్, CNG, LNG, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో సహా ప్రత్యామ్నాయ ఇంధన సాంకేతికత ద్వారా ఆధారితమైన వినూత్న మొబిలిటీ సొల్యూషన్‌లను రూపొందించడానికి సుస్థిరదాయకంగా పనిచేశాయి. ఇప్పటి వరకు, టాటా మోటార్స్ భారతదేశంలోని అనేక నగరాల్లో 730 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేసింది, ఇవి 95% కంటే ఎక్కువ సమయ వ్యవధితో 55 మిలియన్ కిలోమీటర్లకు పైగా ప్రయాణించాయి.