Famous Businessmen to Poor
అనిల్ అంబానీ: అనిల్ అంబానీ తన తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని వారసత్వంగా పొందారు. కానీ, 2G స్కామ్ ఆరోపణలు, భారీ రుణ భారం వంటి అనేక కారణాల వల్ల దానిని కొనసాగించలేకపోయారు.
సుబ్రతా రాయ్: సహారా చైర్మన్ సుబ్రతా రాయ్ పేదల నుంచి కోట్లు దోచుకుని తన సామ్రాజ్యాన్ని పెంచుకున్నారు. 2012లో, సహారా గ్రూప్ సంస్థలు సెక్యూరిటీస్ చట్టాలను ఉల్లంఘించి, చట్టవిరుద్ధంగా రూ.25,700 కోట్లకు పైగా వసూలు చేసారు అని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఆయన వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలింది.
నీరవ్ మోడీ: డైమండ్ మొగల్ నీరవ్ మోడీ, అతని మేనమామ మెహుల్ చోక్సీ లపై మనీ లాండరింగ్ ఆరోపణలతో వారి వ్యాపారాలు కుదేలయ్యాయి. వీరిద్దరూ కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి 13,600 కోట్ల విలువైన క్రెడిట్ లెటర్లను వ్యాపార కొనుగోళ్లు చేయడానికి, భారతదేశం వెలుపల ఉన్న వారి వ్యక్తిగత ఖాతాలలోకి డబ్బును మళ్లించడానికి ఉపయోగించారు.
సత్యం రామలింగ రాజు: సత్యం కంప్యూటర్ రామలింగ రాజు ఒకప్పుడు భారతదేశంలో అత్యంత విజయవంతమైన IT సంస్థల్లో ఒకదానికి నాయకత్వం వహించారు. అయితే ఆ తర్వాత 77,000 కోట్ల భారీ అకౌంటింగ్ మోసానికి పాల్పడ్డారు. దీంతో జైలు పాలవ్వడమే కాదు ఆస్తులు కూడా పోగొట్టుకున్నారు.
విజయ్ మాల్యా: కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అధినేత, లగ్జరీ లైఫ్ గడిపిన లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా.. 9,000 కోట్లకు పైగా అప్పులు చేసి ఎగ్గొట్టారన్న ఆరోపణలపై విచారణను తప్పించుకోవడానికి చివరికి భారతదేశం నుండి పారిపోయారు.
మనం చర్చించిన వారంతా తెలివైనవారు. ఎంతో విలాసవంతమైన లైఫ్ లీడ్ చేశారు. కానీ దురాశ వారిని నాశనం చేసింది. ఇలాంటివారిలో చాలా మంది భారతీయుల నుండి డబ్బును దోచుకున్నారు. వీరు చేసిన తప్పులవల్ల ప్రజలు ఆర్థిక సంస్థలపై కూడా నమ్మకం కోల్పోయేలాగా చేశారు.
Read Also: అవినాశ్ రెడ్డిని రేపు విచారిస్తామని కోర్టుకు తెలిపిన సీబీఐ
Follow us on: Google News, Koo, Twitter