రాహుల్‌ గాంధీని చంపేస్తాం..?

-

Threatening Letter to Rahul Gandhi at Indoor in Madhyapradesh: రాహుల్‌ గాంధీపై బాంబులేసి చంపేస్తామంటూ ఆగంతుకులు రాసిన లేఖ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. భారత్‌ జోడో యాత్రలో బిజీబిజీగా గడుపుతున్న రాహుల్‌.. తన పాదయాత్రలో సామాన్య ప్రజలను కలుస్తూ, వారి కష్టాలను తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ జోడో యాత్ర మహారాష్ట్రలో కొనసాగుతుంది. అయితే, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని జుని పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో ఉన్న ఓ స్వీట్‌ షాపు వద్ద రాహుల్‌ గాంధీపై బాంబు వేసి చంపేస్తాం అని చేతి రాతతో ఉన్న లేఖ (Threatening Letter) లభ్యం అయ్యింది.

- Advertisement -

దీంతో అప్రమత్తమైన పోలీసులు, సమీపంలోని అన్ని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా, రాహుల్‌ గాంధీ తండ్రి, రాజీవ్‌ గాంధీని మానవ బాంబులతో హతమార్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొని, జీవిత ఖైదు శిక్ష ఖరారు అయిన నళిని ఇటీవలే సుప్రీం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ రాహుల్‌కు ఇటువంటి బెదిరింపులు రావటం పట్ల కాంగ్రెస్‌ శ్రేణులు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...