భారత్‌లో విమానాలకు బాంబు బెదిరింపులు(Bomb Threats) రావడం ఏమాత్రం ఆగడం లేదు. కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినా, పోలీసులు వార్నింగ్ ఇచ్చినా ఈ బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. 21 రోజుల్లో 510కిపైగా విమానాలకు ఈ బాంబు బెదిరింపులు వచ్చాయని, వీటి మూలం తెలుసుకోవడానికి కసరత్తులు చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. కాగా ఈ బెదిరింపులు విదేశాల నుంచి సోషల్ మీడియా ఫ్లాట్‌మ్ల గుండా వస్తున్నాయని, దాని కారణంగా వీటి మూలం తెలుసుకోవడం కష్టతరమవుతోందని అధికారులు వివరిస్తున్నారు. వరుసగా బాంబు బెదిరింపులు వస్తుండటంతో విమాన ప్రయాణాలు చేయాలంటే ప్రయాణికులు భయపడుతున్నారని, తమకు సేఫ్టీ ఏంటని ప్రశ్నిస్తున్నారని అధికారులు చెప్పారు. ఇదిలా ఉంటే ఆదివారం రోజు ఉదయం 10 గంటల కల్లా నాలుగు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయని అధికారులు వెల్లడించారు.
‘‘ఈరోజు ఉదయం 10 గంటల కల్లా మూడు ఇండియా విమానాలు, ఒక ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు(Bomb Threats) వచ్చాయి. గోవా నుంచి కలకత్తా వెస్తున్న ఇండిగో(IndiGo) విమానానికి కూడా బెదిరింపు వచ్చాయి. దీంతో విమానాన్ని హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి.. విమానమంతా తనిఖీలు చేశారు. కానీ ఏమీ లభించలేదు. దీంతో పాటుగా బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు, హైదరాబాద్ నుంచి పూణెకు వెళ్లే ఇండిగో విమానాలకు కూడా బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులు అందుకున్న విమానాలకు ఎయిర్‌పోర్ట్ సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఐసొలేషన్‌కు తరలించి తనిఖీలు చేపట్టారు. ఏమీ లభించడకపోవడంతో అవన్నీ కూడా బూటకపు బెదిరింపులే అని నిర్ధారించారు. ప్రయాణికులు భయపడాల్సిన అవసరం లేదు’’ అని అధికారులు తెలిపారు.