మైసూర్ రాజు టిప్పు సుల్తాన్(Tipu Sultan) ఖడ్గాన్ని లండన్ నగరంలో వేలం వేశారు. ఈ వేలంలో టిప్పు సుల్తాన్ ఖడ్గం ఏకంగా రూ.140 కోట్లకు అమ్ముడుపోయింది. వేలం నిర్వహించిన బాన్‌హమ్స్ హౌజ్ ఈ విషయాన్ని వెల్లడించింది. 18వ శతాబ్దపు మహారాజు టిప్పుసుల్తాన్ పడక గదిలో ఉపయోగించే ఈ కత్తిని ఇటీవల వేలం వేసినట్లు లండన్(London)కు చెందిన బోన్ హామ్స్ ఇస్లామిక్ అండ్ ఇండియన్ ఆర్ట్ సేల్ అనే వేలం సంస్థ గురువారం ఓ పత్రికా ప్రకటనలో వెల్లడించింది. బంగారు పిడికిలి, ఉక్కుతో కూడిన ఈ కత్తిని మొఘల్ కళాకారులు 16వ శతాబ్దం నాటి జర్మనీ బ్లేడ్ డిజైన్‌తో తయారు చేశారు. టిప్పుసుల్తాన్ ఉపయోగించిన వ్యక్తిగత ఆయుధాల్లో ఈ కత్తి ప్రత్యేకమైనది. పిడికిలిపై ‘పాలకుడి కత్తి’ అని రాసి ఉంది. ఈ కత్తికి వేలంలో ఊహించిన దానికంటే ఏడు రెట్లు ఎక్కువ ధర పలికిందని బోన్ హామ్స్ సంస్థ వెల్లడించింది. మరాఠాలు, బ్రిటిష్ వాళ్లపై ఎన్నో యుద్ధాల్లో ఘన విజయం సాధించిన టిప్పుసుల్తాన్(Tipu Sultan) కత్తిసాములో, రాకెట్లు, గన్నులు పేల్చడంలో పేరు గడించాడు.
Read Also:
1. కలెక్టర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ఆదేశాలు
2. ఎద అందాలు చూపిస్తూ రెచ్చిపోయిన సుప్రిత.. అందుకోసమేనా?
Follow us on: Google News, Koo, Twitter