పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) తన వారసుడు ఎవరన్న అంశంపై కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఇన్నాళ్లూ అభిషేక్ బెనర్జీనే(Abhishek Banerjee) మమతా వారసుడని అంతా అనుకున్నారు. ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలతో అభిషేక్.. మమతా వారసుడు కాడని అర్థమవుతోంది. తన వారసుడు ఎవరు అనే విషయాన్ని తాను వ్యక్తి గతంగా నిర్ణయంచబోనని, తృణమూల్ కాంగ్రెస్(TMC) సమష్టిగా ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన వారసుడిపై ఆమె క్లారిటీ ఇచ్చారు.
‘‘టీఎంసీ అంటే నేను కాదు. మేం అంతా కలిస్తేనే పార్టీ. మాది సామూహిక కుటుంబం. ఏ విషయంపై అయినా మేము సమిష్టిగా నిర్ణయం తీసుకుంటాం. టీఎంస క్రమశిక్షణ ఉన్న పార్టీ. ఇందులో ఎవరూ కూడా వ్యక్తిగతంలో నిబంధనలను నిర్దేశించరు. మాకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు అంతా ఉన్నారు. వారసుడి ఎంపికనేది ఉమ్మడి యత్నం’’ అని మమతా(Mamata Banerjee) వివరించారు.