Toyota Kirloskar Motor: స్టాక్‌యార్డ్‌ను ప్రారంభించిన టయోటా కిర్లోస్కర్‌ మోటర్‌

-

Toyota Kirloskar Motor opens northern regional stockyard in Haryana: ప్రపంచ శ్రేణి ఉత్పత్తులు మరియు సేవలను తమ వినియోగదారులకు అత్యంత సులభంగా అందించాలనే తమ కస్టమర్‌ ఫస్ట్‌ ఫిలాసఫీకి అనుగుణంగా టయోటా కిర్లోస్కర్‌ మోటర్‌ (టీకెఎం) నేడు హర్యానాలోని ఫారూఖ్‌ నగర్‌లో తమ ప్రాంతీయ స్టాక్‌యార్డ్‌ను ప్రారంభించినట్లు వెల్లడించింది.

- Advertisement -

ఈ ప్రాంతంలో సౌకర్యవంతమైన మరియు సమర్థవంతమైన పంపిణీ నెట్‌వర్క్‌కు భరోసా అందిస్తూ, వ్యూహాత్మకంగా ఏర్పాటుచేసిన ఈ స్టాక్‌యార్డ్‌ గణనీయంగా డెలివరీ సమయాన్ని ప్రస్తుత 6–8 రోజుల నుంచి గరిష్టంగా రెండు రోజులకు పంజాబ్‌, హర్యానా, రాజస్తాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాంచల్‌ మరియు జమ్మూ అండ్‌ కాశ్మీర్‌లోని డీలర్లకు తగ్గిస్తుంది. టీకెఎం ప్రారంభించిన ఈ స్టాక్‌యార్డ్‌తో ఈ ప్రాంతంలోని వినియోగదారులకు ప్రయోజనం కలుగనుంది.

ఈ రీజనల్‌ స్టాక్‌యార్డ్‌ కారణంగా వారు తమ అభిమాన టయోటా వాహనాలను అత్యంత వేగంగా చేరుకోవడంతో పాటుగా అతి తక్కువ సమయంలో తమ వాహనాల డెలివరీ తీసుకోగలమనే హామీ పొందగలరు. అన్ని మోడల్స్‌ టయోటా వాహనాలకు(Toyota Kirloskar Motor) సంబంధించి విస్తృత శ్రేణిలో స్టాక్‌ లభ్యత ఇక్కడ ఉండనుంది.

ఈ ఐదు ఎకరాల స్టాక్‌ యార్డ్‌లో దాదాపు 900 కార్లను భద్రపరిచే అవకాశాలు ఉన్నాయి. టీకెఎంకు తరహా స్టాక్‌యార్డ్‌లలో ఇది రెండవది. అంతకు ముందు అంటే 2020 లో గౌహతీలో తమ మొదటి ప్రాంతీయ స్టాక్‌యార్డ్‌ను టీకెఎం ఏర్పాటుచేసింది. ఈ ప్రాంతీయ స్టాక్‌యార్డ్‌1, గౌహతీ ద్వారా ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాల డీలర్లు, వినియోగదారులు ప్రయోజనం పొందుతున్నారు.

అంతేకాదు, ఫారూఖ్‌ నగర్‌ స్టాక్‌యార్డ్‌ వల్ల వేగం, సౌకర్యం పెరగడం, ఖర్చులు గణనీయంగా తగ్గడంతో పాటుగా మరీ ముఖ్యంగా కార్బన్‌ డై ఆక్సైడ్‌ తగ్గుతుంది. ఎందుకంటే టీకెఎం ప్లాంట్‌ నుంచి స్టాక్‌యార్డ్‌కు వాహనాలు అధికంగా రైలు మార్గంలో చేరతాయి. ప్రస్తుతం 60% కు పైగా టీకెఎం డిశ్పాచ్‌లు రైలు మార్గంలో జరుగుతున్నాయి. దీనిని కనీసం 80%కు పెంచాలన్నది లక్ష్యం. అంతేకాదు, నెలకు 5వేల వాహనాలను డెలివరీ చేయగలరు.

ఈ స్టాక్‌యార్డ్‌ ప్రారంభం గురించి టీకెఎం జనరల్‌ మేనేజర్‌ శ్రీ వి వైజ్‌లైన్‌ సిగమణి మాట్లాడుతూ ‘‘హర్యానాలో మా మొట్టమొదటి ప్రాంతీయ స్టాక్‌యార్డ్‌ ప్రారంభించామని వెల్లడించేందుకు సంతోషిస్తున్నాము. భారతదేశపు ఉత్తర భాగంలో మార్కెట్‌ మాకు అత్యంత కీలకమైనది మరియు మా కస్టమర్‌ ఫస్ట్‌ విధానంతో ఫారూఖ్‌నగర్‌లో ఈ వ్యూహాత్మక ప్రాంతం మరింతగా ఈ మార్కెట్‌లో మా వినియోగదారులను అతి సులభంగా చేరుకోవడం సాధ్యమవుతుంది.

గ్రీన్‌ మొబిలిటీ పరిష్కారాలలో అగ్రగామిగా, టయోటా ఇప్పుడు అత్యుత్తమ భవిష్యత్‌కు భరోసా అందించడంతో పాటుగా మేము చేసే ప్రతి కార్యక్రమంలోనూ పర్యావరణ అనుకూల పరిష్కారాలను అందించడంపై దృష్టి సారించాము. అది మెటీరియల్‌ సోర్సింగ్‌, తయారీ లేదా అమ్మకాలు మరియు సేవలలో కూడా కనిపిస్తుంది. రీజనల్‌ స్టాక్‌యార్డ్‌ ద్వారా మా అభిమానులకు మరింత చేరువ కావడంతో పాటుగా రవాణా ఖర్చులను సైతం గణణీయంగా తగ్గించగలము. దీనితో పాటుగా కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఉద్గారాలను గణనీయంగా తగ్గించగలము’’అని అన్నారు.

భారతదేశంలో టీకెఎం యొక్క ప్రస్తుత ఉత్పత్తి శ్రేణిలో పూర్తి సరికొత్త ఇన్నోవా హైక్రాస్‌, అర్బన్‌ క్రూయిజర్‌ హైరైడర్‌, కంపాక్ట్‌ ఎస్‌యువీలు ఉన్నాయి. ఇవి యువ మరియు వివేకవంతులైన వినియోగదారులను ఆకట్టుకుంటారు. ప్రీమియం విభాగంలో కామ్రీ హైబ్రిడ్‌ మరియు వెలిఫైర్‌ ఉండటమే కాకుండా , ఇన్నోవా హై క్రాస్‌ మరియు అర్బన్‌ హై క్రూయిజర్‌ హై రైడర్‌ రెండూ టయోటా యొక్క సెల్ఫ్‌ ఛార్జింగ్‌ స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ వేరియంట్‌తో లభ్యమవుతాయి. తద్వారా మాస్‌ ఎలక్ట్రిఫికేషన్‌ దిశగా టీకెఎం యొక్క ప్రయత్నాలను ఇది పునరుద్ఘాటిస్తుంది.

అలాగే వినియోగదారులు ఎంచుకునేందుకు మరిన్ని ఎంపికలనూ అందిస్తుంది. టీకెఎం ఇప్పుడు ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యునర్‌ మరియు లెజెండర్‌లను భారతీయ మార్కెట్‌లో అందిస్తుంది. ఈ ప్రతిష్టాత్మక మోడల్స్‌ ఎంపీవీ మరియు ఎస్‌యువీ విభాగాలలో నాయకత్వ స్ధానం ఆస్వాదిస్తున్నాయి. మరో టయోటా వాహనం,ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా యువత మరియు మొదటి సారి వాహనం కొనుగోలు చేసిన వినియోగదారుల నడుమ ప్రాచుర్యం పొందిన వాహనం గ్లాంజా. దీనిని గత రెండు సంవత్సరాలుగా టయోటా అందిస్తుంది. టయోటా 22 నూతన కస్టమర్‌ టచ్‌ పాయింట్లను ఉత్తర భారతదేశంలో ప్రారంభించింది. తద్వారా ఉత్తర భారతదేశంలో అధిక శాతం మార్కెట్‌ను సేల్స్‌, సర్వీస్‌ పాయింట్లతో చేరుకుంటుంది. ఈ టయోటా టచ్‌ పాయింట్లను గురించి వినియోగదారులు మరింతగా https://www.toyotabharat.com/find-a-dealer/. వద్ద చూడవచ్చు.

Read Also: హైదరాబాద్స్‌ గాట్‌ టాలెంట్‌ ’ షో

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...