Truecaller పై ప్రభుత్వ సేవలు

-

Truecaller launches in-app directory for government sources:  వేల కొలదీ ధృవీకరించబడిన ప్రభుత్వ అధికారుల పరిచయాలకు సులభమైన లభ్యతను అందించడము ద్వారా, భారత పౌరులు మరియు ప్రభుత్వాల మధ్య అపరిమిత పరస్పరచర్యకు సహకారం అందించుటకు ట్రూకాలర్ ఒక ఇన్ యాప్ డిజిటల్ ప్రభుత్వ డైరెక్టరీని ప్రవేశపెట్టింది. ఇది యూజర్లను కుంభకోణాలు, మోసాలు మరియు స్పామ్ నుండి రక్షించుట ద్వారా పౌర సేవలలో విశ్వాసాన్ని ఏర్పరచుటకు ఒక ముఖ్యమైన చర్య.

- Advertisement -

డిజిటల్ ప్రభుత్వ డైరెక్టరీ ట్రూకాలర్ యాప్ యూజర్లకు కేంద్రపాలిత ప్రాంతాలతో సహా సుమారు 23 రాష్ట్రాలలోని హెల్ప్‎లైన్లు, చట్టం అమలు ఏజెన్సీలు, రాయబార కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు మరియు ఇతర కీలక శాఖలకు ప్రాప్యతను అందిస్తుంది. ఈ సమాచారము నేరుగా ప్రభుత్వము మరియు అధికారిక ప్రభుత్వ వనరుల నుండి తీసుకోబడింది. ప్రజలకు ప్రభుత్వ ప్రతినిధుల ప్రాప్యతకు సహాయపడటము మరియు క్రమబద్ధీకరించటము మరియు ప్రభుత్వముతో సమస్యా-రహిత విధానములో అనుసంధానించుటకు 240 మిలియన్ల భారతీయ ట్రూకాలర్ యూజర్లకు సహకరించడము ఈ ప్రయత్నము యొక్క లక్ష్యము.

నెటిజన్లు మరియు సంబంధిత వాటాదారులతో పరస్పర చర్యల ఆధారంగా, ఫోన్ పై అత్యంత భారీ కుంభకోణాలలో ఒకటి ప్రభుత్వ అధికారుల వేషధారణ అని ట్రూకాలర్ తెలుసుకుంది. ధృవీకరించబడిన ప్రభుత్వ పరిచయాల డైరెక్టరీ తయారీ, కమ్యూనికేషన్ లో విశ్వాసాన్ని పెంచడము మరియు మా యూజర్లను మోసాలు మరియు కుంభకోణాల నుండి రక్షించుటకు ట్రూకాలర్ యొక్క ప్రయత్నాల కొనసాగింపు. సంబంధిత నంబరు ధృవీకరించబడిందని సూచిస్తూ యూజర్లు ఆకుపచ్చని నేపథ్యము మరియు ఒక నీలి రంగు టిక్ గుర్తు చూస్తారు. డైరెక్టరీని విస్తరించుటకు ట్రూకాలర్ వివిధ ప్రభుత్వ శాఖలతో కలిసి పనిచేస్తోంది మరియు యూజర్ ఫీడ్‎బ్యాక్ ఆధారంగా తరువాతి దశలో జిల్లా మరియు మునిసిపల్ స్థాయిలలో పరిచయాలను చేర్చాలని యోచిస్తోంది. అలాగే సమాచారాన్ని షేర్ చేసి డైరెక్టరీలో ధృవీకరించబడుటకు ప్రభుత్వ ఏజెన్సీకి ఒక సులభమైన ప్రక్రియను ట్రూకాలర్ రూపొందించింది.

ఈ ప్రయత్నముపై తన అభిప్రాయాలను పంచుకుంటూ, శ్రీ. జయేష్ రంజన్, ఐఏఎస్, సమాచార సాంకేతికత, వాణిజ్య & పరిశ్రమల శాఖల సెక్రెటరీ, తెలంగాణ ప్రభుత్వము ఇలా అన్నారు, “పౌరులు మరియు ప్రభుత్వము మధ్య కమ్యూనికేషన్లలో విశ్వాసాన్ని మెరుగుపరచుటకు ట్రూ కాలర్ యొక్క ఈ ప్రయత్నాన్ని నేను స్వాగతిస్తున్నాను. భారతదేశములో చాలామంది మొబైల్ మరియు ఇంటర్నెట్ ఉపయోగిస్తున్న తరుణములో, వ్యవస్థలో విశ్వాసాన్ని ఏర్పరచుట మరియు యూజర్ సురక్షిత కొరకు సాధనాలను అందించడము అత్యవసరం అవుతుంది. ట్రూ కాలర్ యొక్క ప్రయత్నము ప్రభుత్వ అధికారుల ధృవీకరణ సంప్రదింపులకు లభ్యతను అందిస్తుంది మరియు కుంభకొణాలు మరియు మోసాలకు దారితీసే వంచన వంటి సైబర్ నేరాలను పరిష్కరించుటకు ప్రభుత్వము తీసుకునే చర్యలను సమర్థవంతంగా పూరిస్తుంది.”

ఈ విశేషత ప్రారంభముపై వ్యాఖ్యానిస్తూ, ప్రజ్ఞామిశ్రా, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ అఫెయిర్స్, ట్రూకాలర్ ఇలా అన్నారు, “ట్రూకాలర్ కేవలం ఒక కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ కంటే ఎక్కువగా ఆవిర్భవించింది మరియు ఈరోజు డిజిటల్ కమ్యూనికేషన్ లో విశ్వాసాన్ని పెంచడము ద్వారా భారతదేశములో పట్టణ మరియు అభివృద్ధి చెందుతున్న సెమీ-పట్టణ/గ్రామీణ మార్కెట్ల మధ్య డిజిటల్ విభజనను తగ్గిస్తోంది. కుంభకోణాలు మరియు మోసాలకు దారితీసే ప్రభుత్వ అధికారుల వేషధారణల వ్యాప్తి నుండి ప్రజలను రక్షించుటకు ఇది మా ప్రయత్నము. ఈ విశేషత ద్వారా, పౌరులు అవసరమైనప్పుడు సరైన అధికారులను కలుసుకోగలుగుతారు అని విశ్వసిస్తున్నాము. ఇది ప్రభుత్వ నంబర్లు ఉన్న డిజిటల్ డైరెక్టరీగా మొదటి మరియు ప్రత్యేక ప్రయత్నము మరియు యూజర్ ఫీడ్‎బ్యాక్ ఆధారంగా దీనిని మెరుగుపరచే ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. విశ్వాసాన్ని ఏర్పరచడము ద్వారా కమ్యూనికేషన్ ను సురక్షితంగా చేయుటకు మా ప్రయత్నాలను సమలేఖనం చేయడాన్ని కొనసాగిస్తూ ఉంటాము”.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...