పాకిస్థాన్‌లో పర్యటించనున్న కేంద్ర మంత్రి

-

కేంద్ర మంత్రి హోదాలో పాకిస్థాన్‌లో పర్యటించడానికి సిద్ధమయ్యారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్(Jaishankar). ఈ నెల 15,16 తేదీల్లో ఆయన పాకిస్థాన్ ఇస్లామాబాద్‌లో పర్యటించనున్నారు. ఇస్లాబాద్ వేదికగా జరగనున్న షాంఘై సహకార సంఘం(SCO) సమావేశానికి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే ఇస్లామాబాద్‌కు పయనం కావడానికి రెడీ అయ్యారు జైశంకర్. ఎస్‌సీఓ సమావేశానికి ఈ ఏడాది పాకిస్థాన్ ఆతిథ్యం వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి హాజరుకావాలంటూ జైశంకర్‌కు ఆహ్వానం అందింది. ఈ క్రమంలో ఆయన పాక్‌కు వెళ్లనున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ వెల్లడించారు. పాకిస్థాన్ నుంచి ఎస్‌సీఓ సదస్సుకు ఆహ్వానం రానున్నట్లు కేంద్రం ఆగస్టు 30న ధ్రువీకరించింది.

- Advertisement -

ఈ శిఖరాగ్ర సమావేశంలో సభ్య దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొని తమ దేశాల మధ్య ఆర్థిక, సామాజిక, సాంకృతిక, మానవతా సహకారంపై దృష్టి సారించనున్నారు. వెనకబడి ఉన్న దేశాలకు ఇతర దేశాలు సహకారం అందిస్తాయి. ఈ దిశగానే పలు రౌండ్లో సీనియర్ అధికారుల సమావేశాలు జరగనున్నాయి. ఈ ఫాంఘై సదస్సును 2001లో స్థాపించారు. తొలుత ఈ సదస్సులో రష్యా, చైనా, కిర్గిజ్ రిపబ్లిక్, కజికిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్‌లు ఉన్నాయి. 2017లో SCO సదస్సులో భారత్, పాకిస్థాన్ దేశాలు శాశ్వత సభ్యత్వ దేశాలుగా మారాయి. గతేడాది భారత్ ఈ సదస్సుకు ఆతిథ్యం వహించింది.

Read Also: అమరావతికి కొత్త రైల్వే లైన్.. ప్రకటించిన జీఎం అరుణ్
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...