సివిల్స్‌ ఫలితాల్లో తెలుగు అభ్యర్థుల హవా.. అట్లుంటది మనతోని..

-

యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్‌ ఫలితాల్లో(UPSC Civil Service Results) తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటిన సంగతి తెలిసిందే. మహబూబ్‌నగర్‌కు చెందిన అనన్య రెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకుతో ఔరా అనింపించారు. తొలి ప్రయత్నంలోనే మూడో ర్యాంక్ సాధించడం విశేషం. ఆదిత్య శ్రీవాస్తవ తొలి ర్యాంకు సాధించగా.. అనిమేష్‌ ప్రధాన్‌ (2), దోనూరు అనన్య రెడ్డి(3), పీకే సిద్ధార్థ్‌ రామ్‌కుమార్‌ (4), రుహాని (5), సృష్టి దబాస్‌ (6), అన్‌మోల్‌ రాఠోర్‌ (7), ఆశీష్‌ కుమార్‌ (8), నౌషీన్‌ (9), ఐశ్వర్యం ప్రజాపతి (10) ర్యాంకులతో మెరిశారు.

- Advertisement -

ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన నందల సాయికిరణ్‌ 27, మేరుగు కౌశిక్‌ 82, పెంకీసు ధీరజ్‌రెడ్డి 173, జి.అక్షయ్‌ దీపక్‌ 196, గణేశ్న భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ 198, నిమ్మనపల్లి ప్రదీప్‌ రెడ్డి 382, బన్న వెంకటేశ్‌ 467, కడుమూరి హరిప్రసాద్‌ రాజు 475, పూల ధనుష్‌ 480, కె.శ్రీనివాసులు 526, నెల్లూరు సాయితేజ 558, కిరణ్‌ సాయింపు 568, మర్రిపాటి నాగభరత్‌ 580, పోతుపురెడ్డి భార్గవ్‌ 590, కె.అర్పిత 639, ఐశ్వర్య నెల్లిశ్యామల 649, సాక్షి కుమారి 679, చౌహాన్‌ రాజ్‌కుమార్‌ 703, గాదె శ్వేత 711, వి.ధనుంజయ్‌ కుమార్‌ 810, లక్ష్మీ బానోతు 828, ఆదా సందీప్‌ కుమార్‌ 830, జె. రాహుల్‌ 873, హనిత వేములపాటి 887, కె.శశికాంత్‌ 891, కెసారపు మీన 899, రావూరి సాయి అలేఖ్య 938, గోవద నవ్యశ్రీ 995 ర్యాంకులు సాధించి విజయబావుటా ఎగరేశారు.

UPSC Civil Service Results | కాగా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 1,105 ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ వంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. గతేడాది మే 28న ప్రిలిమ్స్‌ నిర్వహించారు. ప్రిలిమినరీ పరీక్షలో పాస్ అయిన వారికి సెప్టెంబర్‌ 15, 16, 17, 23, 24 తేదీల్లోమెయిన్స్‌ పరీక్ష నిర్వహించారు. అనంతరం డిసెంబర్‌ 8న మెయిన్స్‌ ఫలితాలు విడుదల చేశారు. మెయిన్స్‌లో సత్తా చాటిన వారికి జనవరి 2, ఏప్రిల్‌ 9 మధ్య వివిధ దశల్లో పర్సనల్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి తాజాగా తుది ఫలితాలు ప్రకటించారు. మొత్తం 1,016 మంది ఎంపిక అవ్వగా.. జనరల్‌ కేటగిరీలో 347 మంది, ఈడబ్ల్యూఎస్‌ నుంచి 115, ఓబీసీ నుంచి 303, ఎస్సీ కేటగిరీలో 165 , ఎస్టీ కేటగిరీలో 86 మంది చొప్పున సెలెక్ట్ అయ్యారు.

Read Also:  తెలుగు రాష్ట్రాల్లో మొదలైన నామినేషన్ల ప్రక్రియ.. తొలి రోజు కీలక నేతల నామినేషన్లు..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...