UPSC Results |సివిల్స్-2022 తుది ఫలితాలు విడుదల అయ్యాయి. దేశవ్యాప్తంగా 933 మంది సివిల్స్ సర్వీసెస్‌కు ఎంపిక అయినట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ప్రకటించింది. ఇందులో జనరల్ కోటాలో 345 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 99, ఓబీసీ 263, ఎస్సీ 154, ఎస్టీ విభాగం నుంచి 72 మంది ఉన్నారు. పోస్టుల వారీగా చూస్తే ఐఏఎస్‌కు 180 మంది, ఐఎఫ్‌ఎస్ 38, ఐపీఎస్ 200 మంది ఎంపికయ్యారు. ఈ ఫలితాల్లో ఇషితా కిశోర్ మొదటి ర్యాంక్ సాధించగా.. ఏపీలోని తిరుపతికి చెందిన పవన్ దత్తాకు 22వ ర్యాంక్ వచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన శ్రీసాయి ఆశ్రిత్ శాఖమూరి 40, హెచ్‌ఎస్ భావన 55, ఆవుల సాయికృష్ణ 94వ ర్యాంక్ సాధించారు.
- Advertisement -
Read Also: లైక్ చేసింది.. పాపం రూ.19లక్షలు పోగొట్టుకుంది
Follow us on: Google News, Koo, Twitter