ట్రైనీ ఐఏఎస్ పూజ ఖేడ్కర్(Pooja Khedkar) కొన్ని రోజులుగా వార్తల్లో తెగ నిలుస్తున్నారు. యూపీఎస్‌సీ పరీక్ష కోసం ఆమె తప్పుడు సర్టిఫికెట్‌లు, తప్పుడు సమాచారం అందించిందని యూపీఎస్‌సీ నిర్దారించింది. ఈ మోసం ద్వారా ఆమె పరిమితి కంటే ఎక్కువసార్లే ఆమె యూపీఎస్‌సీ పరీక్ష రాసిందని కూడా యూపీఎస్‌సీ బోర్డు స్పష్టం చేసింది. ఆమె సర్టిఫికెట్‌లు, ఆమె అందించిన సమాచారం అంతా ఫేక్ అని తెలియడంతో పూజపై క్రిమినల్ చర్యలు తీసుకోవలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అధికారులు చెప్పారు.
2022వ సంవత్సరపు యూపీఎస్‌సీ పరీక్షలో ఆమె అభ్యర్థిత్వాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. దాంతో పాటుగా భవిష్యత్తులో మళ్ళీ యూపీఎస్‌సీ పరీక్ష రాయకుండా ఆమెను నిషేధిస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేశామని వెల్లడించారు. ఇదిలా ఉంటే 2022 యూపీఎస్‌సీ పరీక్షలో పూజ ఖేడ్కర్(Pooja Khedkar) 821వ ర్యాంక్ సాధించారు. అయితే శిక్షణ సమయంలోనే పలు తప్పుడు కారణాల వల్ల వార్తల్లో నిలిచారామే. పూణేలో అసిస్టెంట్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో కూడా ఆమె వ్యవహారశైటి, డిమాండ్లు వివాదాస్పదంగా మారాయి. అధికార దుర్వానియోగానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు కూడా ఆమె ఎదుర్కొన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆమెపై విచారణ జరపడానికి కేంద్రం ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. విచారణ క్రమంలో ఆమె పూణె నుంచి వాషిమ్‌కు బదిలీ చేశారు.
Read Also: మాజీ సీఎం జగన్‌కు పాత కార్లు.. అందుకేనా..!
Follow us on: Google News, Twitter, ShareChat