Mobile Phone Blast: ఓ యువకుడు కాల్ మాట్లాడుతుండగా మొబైల్ పేలిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో సదరు యువకుడి వేలికి గాయమైంది. వివరాల్లోకి వెళితే అమ్రోహా జిల్లాలోని నౌగావా సాదత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిజాంపూర్ గ్రామానికి చెందిన హిమాన్షు.. తన బంధువుతో ఫోన్ మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా మొబైల్ పేలి మంటలు చెలరేగాయి. దీంతో యువకుడి వేలికి గాయమైంది. మొబైల్ పూర్తిగా కాలిపోయింది. కాగా తాను మొబైల్ కొని నాలుగు నెలలే అయిందని హిమాన్షు తెలిపాడు.
Mobile Phone Blast: కాల్ మాట్లాడుతుండగా పేలిన మొబైల్ ఫోన్
-