తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ లో VI గిగానెట్‌ తో స్పీడ్ డబుల్

-

VI enhance its network capacity in Telangana, Andhra Pradesh: సుప్రసిద్ధ టెలికామ్‌ సేవల ప్రదాత, వి తమ నెట్‌వర్క్‌ అనుభవాలను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా (ఏపీ అండ్‌ టీ) రాష్ట్రాలలోని వినియోగదారులకు మెరుగుపరిచేందుకు పలు కార్యక్రమాలను వేగవంతమైన స్పీడ్స్‌ కోసం ప్రారంభించింది. వి ఇప్పుడు అదనపు 1800 మెగా హెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌ బ్యాండ్‌ను తమ 11వేల సైట్స్‌ వద్ద ఈ రెండు రాష్ట్రాల్లో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మరింత వేగవంతమైన డౌన్‌లోడ్స్‌, అప్‌లోడ్స్‌, స్ట్రీమింగ్‌ను అందిస్తుంది.

- Advertisement -

గత సంవత్సర కాలంలో అదనంగా 660 నూతన సైట్ల ను వి జోడించడం తో పాటుగా 6201 సైట్లలో అదనపు సామర్ధ్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సామర్థ్య పెంపు వల్ల కలిగే ప్రయోజనాలను వినియోగదారులకు వెల్లడించేందుకు ప్రత్యేకంగా ప్రచారాన్ని సైతం వి ప్రారంభించింది. ఈ ప్రచారం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వినియోగదారులు వి గిగానెట్‌ పై రెండు రెట్ల వేగం అనుభవించాల్సిందిగా ఆహ్వానిస్తుంది.

ఈ కార్యక్రమం గురించి వోడాఫోన్‌ ఇండియా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా,కర్నాటక క్లస్టర్‌ బిజినెస్‌ హెడ్‌ సిద్దార్థ జైన్‌ మాట్లాడుతూ ‘‘మా ప్రస్తుత ప్రచారానికి అనుగుణంగా, ఏపీ మరియు తెలంగాణాలోని మా వినియోగదారులందరినీ మా అత్యున్నత, ఆధునీకరించిన నెట్‌వర్క్‌ అనుభవాలను రెండు రెట్ల వేగంతో వి గిగానెట్‌పై ఆస్వాదించాల్సిందిగా కోరుతున్నాము. గత సంవత్సర కాలంగా మేము మా కవరేజీ విస్తరించేందుకు పలు కార్యక్రమాలు ప్రారంభించాము. అందుబాటులోని ప్లాన్స్‌ ను వి వినియోగదారులు ఎంచుకోవడం ద్వారా వి నెట్‌వర్క్‌పై మరింతగా మెరుగైన అనుభవాలను పొందవచ్చు’’ అని అన్నారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...