తమిళ స్టార్ హీరో ఇళయథళపతి విజయ్(Vijay Thalapathy) పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికే సొంత పార్టీని స్థాపించి, ఇటీవల పార్టీ జెండాను, గీతాన్ని కూడా ఆవిష్కరించాడు. తాజాగా తన రాజకీయ రంగప్రవేశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు విజయ్. సినిమా రంగంతో పోలిస్తే రాజకీయం చాలా సీరియస్ రంగమని చెప్పుకొచ్చారు. విల్లుపురం సమీపంలో నిర్వహించిన తమిళగ వెట్రి కళగం(Tamilaga Vettri Kazhagam) పార్టీ మొదటి మహానాడులో విజయ్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగానే సుధీర్ఘ ప్రసంగం కూడా ఇచ్చాడు. ఈ ప్రసంగంలో తన పార్టీ సిద్దాంతాలను కూడా ప్రస్తావించాడు. వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు హాజరుకావడంతో ఈ సభ గ్రాండ్ సక్సెస్‌గా నిలిచింది.
‘‘నాకు రాజకీయ అనుభవం లేకపోవచ్చు. అలాగని పాలిటిక్స్ విషయంలో నేను భయపడట్లేదు. చాలా మంది ఎన్నో మాట్లాడుతున్నారు. వాటన్నింటికి సమాధానమిస్తా. సినీ రంగంతో పోలిస్తే రాజకీయం అంత ఈజీ కాదు. ఎన్ని సమస్యలొచ్చినా పోరాడి నిలబడతాను’’ అని విజయ్ ప్రసంగించాడు. అతడి ప్రసంగంతో అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం పరవళ్లు తొక్కింది. ఆయన
ప్రసంగిస్తునంత సేపు సభా ప్రాంగణం అంతా హర్షద్వానాలు, కేరింతలతో దద్దరిల్లింది. మరి సభ గ్రాండ్ సక్సెస్ అయిన విజయ్(Vijay Thalapathy) పాలిటిక్స్‌లో ఏమాత్రం రాణిస్తాడో చూడాలి.