దేశానికి శత్రువులుగా మారిన శక్తులను అణచివేయాలని దేశ ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్(Jagdeep Dhankhar) అన్నారు. మన దేశ సంస్కృతి, భగవద్గీత కూడా అదే బోధిస్తుందని ఆయన గుర్తు చేశారు. వికసిత్ భారత్ అనేది ఒకపై సుదీర్ఘ కాల కలగా ఉండబదని, పౌరుల ఉమ్మడి కృషితో దీనిని సాధించాలని ఆయన అన్నారు. దేశం లోపల, వెలుపల కూడా కొన్ని శక్తులు తమ ధన బలం, యంత్రాంగాలను ఉపయోగించి భారత్‌కు హాని తలపెట్టాలని చూస్తున్నాయన్నారు. దేశంలోని సంస్థలను నిర్వీర్యం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. మన రాజ్యాంగ సంస్థల ప్రభావాన్ని తగ్గించడమే వారి చెడు ఆలోచన, హాని కలింగాలన్న లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
Read Also: ఏయే విటమిన్ వల్ల ఏంటి లాభం.. వాటిని పొందాలంటే ఏం తినాలి..?
‘‘మన దేశ సంస్థలను కలుషితం చేయడం. వాటికి చెడ్డ పేరు తీసుకురావడం. మన అభివద్ధికి అడ్డంకులు కలిగించడం. వంటివే ఈ శక్తుల లక్ష్యం. ఇటువంటి దేశ విద్రోహ శక్తులను ఎట్టిపరిస్థితుల్లో విడిచిపెట్టకూడదు. వారిని అణచివేయాల్సిందే’’ అని ఆయన అన్నారు. హర్యానాలో జరుగుతున్న అంతర్జాతీయ గీతా ఉత్సవంలో ఆయన పాల్గొన్నరు. మనం గీతోపదేశాన్ని దృష్టిలో పెట్టుకుని అర్జునుడు ఎలా అయితే లక్ష్యంపై దృష్టి సారించాడే అటువంటి అంకితభావం, ఏకాగ్రతతోనే మనం కూడా వికసిత్ భారత్‌ను సాధించాలని Jagdeep Dhankhar పిలుపునిచ్చారు.