మహారాష్ట్ర(Maharashtra) ఎన్నికల వేళ మాజీ ఎంపీ, నటి నవనీత్ రాణా(Navneet Kaur Rana) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెదిరిస్తే భయపడే రోజులు పోయాయని, భరించే ప్రసక్తే లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈసారి వచ్చే బెదిరింపులకు అంతే ఘాటుగా సమాధానం ఇస్తామని అన్నారామే. అయితే మహారాష్ట్ర ఎన్నికల వేళ ఆమె నిర్వహించిన ప్రచార సభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై స్పందిస్తూనే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆమె సభలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అభ్యంతరకరంగా వ్యవహరించడంతో తీవ్ర టెన్షన్ నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అక్కడి పరిస్థితులను సర్దుమణిగించారు. అంతేకాకుండా ఈ ఘటనకు సంబంధించి 45 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు కారణమైనా ప్రతి ఒక్కరినీ అదుపులోకి తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగానే నవనీత్ రాణా కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘ఖల్లార్ గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో నేను మాట్లాడుతుండగా కొందరు మతపరమైన నినాదాలు చేశారు. నా ప్రచారాన్ని ముగించుకున్న తర్వాత.. మహాయుతి కూటమి(Mahayuti Alliance) అభ్యర్థికి మద్దతుగా అక్కడకు వచ్చిన కొందరు మహిళలు, దివ్యాంగులు, మహిళలు, చిన్నారులను కలవడానికి వెళ్లారు. కొందరు అక్కడకు కూడా వచ్చి నినాదాలు చేశారు. నన్ను బెదిరించడం కూడా మొదలు పెట్టారు. కుర్చీలు విసిరారు. నాపై దాడికి యత్నించారు. ఈ ఘటన కాంగ్రెస్ బెదిరింపు సంస్కృతికి మద్దతు పలుకుతోంది. వీరి బెదిరింపులను మౌనంగా భరించే, వాటికి భయపడే రోజులు పోయాయి. ఈ ఘటనపై ఉద్ధవ్ ఠాక్రేకు కచ్చితంగా సమాధానం ఇస్తాం’’ అని ఆమె(Navneet Kaur Rana) చెప్పారు.