చారిత్రాత్మక మహిళా బిల్లుకి లోక్ సభ ఆమోదం.. ఓటింగ్ ఎలా జరిగందంటే?

-

కొత్త పార్లమెంటులో చారిత్రాత్మక బిల్లు ఆమోదం పొందింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందింది. నారీ శక్తి వందన్ అధినియమ్ పేరుతో ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సెప్టెంబర్ మంగళవారం ప్రవేశ పెట్టారు. బుధవారం దీనిపై పార్లమెంటులో వేడివేడి చర్చ జరిగింది. దాదాపు ఎనిమిది గంటలపాటు చర్చ అనంతరం న్యాయశాఖ మంత్రి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్ లో 456 మంది సభ్యులు పాల్గొనగా.. బిల్లుకు అనుకూలంగా 454 మంది, వ్యతిరేకంగా ఇద్దరు సభ్యులు ఓట్లు వేశారు.

- Advertisement -

మెజారిటీ సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడంతో లోక్ సభలో మహిళా బిల్లు ఆమోదం పొందింది. దీంతో మహిళా రిజర్వేషన్ బిల్లు గురువారం (సెప్టెంబర్ 21) రాజ్యసభకు వెళ్లనుంది. రాజ్యసభలో కూడా ఈ బిల్లుపై ఓటింగ్ జరగనుంది. విపక్షాలు కూడా ఈ బిల్లుకు మద్దతు తెలుపుతుండటంతో అక్కడ సైతం ఇది ఆమోదం పొందడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న ఈ బిల్లు ఉభయ సభల ఆమోదం పొందితే.. మూడు దశాబ్దాల ప్రయత్నం చివరకు ఫలించినట్లు అవుతుంది. కాగా, బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన వారిలో ఎంఐఎం ఎంపీలు అసదుద్దీన్ ఓవైసీ, ఇంతియాజ్ జలీల్ ఉన్నారు.

లోక్ సభలో ఓటింగ్ ఇలా జరిగింది: 

మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాన్యువల్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. ఎరుపు, ఆకుపచ్చ స్లిప్పులను సభ్యులందరికీ అందజేశారు. అనంతరం ఓటింగ్ జరిగే ప్రక్రియపై లోకసభ సెక్రటరీ జనరల్ వారికి వివరించారు. బిల్లుకు మద్దతు తెలిపినట్లయితే ‘ఎస్’ అని ఆకుపచ్చ స్లిప్పుపై రాయాలి. వ్యతిరేకిస్తే ఎరుపు స్లిప్పుపై ‘నో’ అని రాయాలని చెప్పారు. అనంతరం ఓటింగ్ నిర్వహించారు. రాజ్యాంగ సవరణ కూడా ఉండటంతో మాన్యువల్ పద్ధతిలో ఓటింగ్ చేపట్టారు. ఓటింగ్ కు కొద్దిసేపటి ముందు ప్రధాని మోదీ సభలోకి వచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...