కేంద్ర కీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur)తో రెజ్లర్ల(Wrestlers) సమావేశం ముగిసింది. దాదాపు ఆరుగంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలకమైన విషయాలపై చర్చించారు. మహిళ నేతృత్వంలో రెజ్లింగ్ ఫెడరేషన్‌లో అంతర్గత ఫిర్యాదు కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్(Brij Bhushan Singh) మూడుసార్లు డబ్ల్యూఎఫ్ఐ(WFI) చీఫ్ పదవి చేపట్టినందున మరోసారి ఆయనను ఎన్నుకోరాదని రెజ్లర్లు పట్టుబట్టారు. దీంతో ఈనెల 30లోగా WFI ఎన్నికలను నిర్వహిస్తామని అనురాగ్ హామీ ఇచ్చారు. అలాగే జూన్ 15లోగా రెజ్లర్లు ఎలాంటి నిరసనలు చేపట్టరాదని రెజ్లర్లను అనురాగ్ కోరగా.. అందుకు అంగీకరించిన వారు అప్పటివరకు తమ ఆందోళన విరమించుకుంటామని తెలిపారు. అయితే అప్పటిలోగా తమ డిమాండ్లు నెరవేర్చకపోతే తమ నిరసన కొనసాగుతుందని రెజ్లర్లు(wrestlers) స్పష్టంచేశారు. కాగా ఈ సమావేశంలో సాక్షి మాలిక్, వినేశ్ ఫొగట్, భజరంగ్ పునియా సహా పలువురు రెజ్లర్లు, రైతు సంఘాల నేత రాకేష్ టికాయత్ పాల్గొన్నారు.