పార్లమెంట్ వద్ద హైటెన్షన్.. పోలీసుల అదుపులో సాక్షి మాలిక్

-

Wrestlers Protest |ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరనస ఉద్రిక్తంగా మారింది. ఆదివారం నూతన పార్లమెంట్ భవనం ముందు బ్రిజ్‌భూషణ్‌పై చర్యలకు డిమాండ్ చేస్తూ ర్యాలీగా వెళ్తున్న రెజ్లర్లను(Wrestlers Protest) ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. వినేశ్ ఫోగట్, సాక్షిమాలిక్, బజరంగ్ పూనియా సహా నిరసన తెలుపుతున్న రెజ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జంతర్ మంతర్ వద్ద వినేశ్ ఫోగట్, ఆమె బంధువు, సోదరి సంగీతా ఫోగట్ బారికేడ్లను దాటి పార్లమెంట్ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో రెజ్లర్లు, పోలీసుకు మధ్య తోపులాట జరిగింది. ఇరువర్గాలు ఒకరునొకరు తోసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని బలవంతంగా బస్సుల్లో ఎక్కించారు. ఇదిలావుండగా, సాక్షి మాలిక్‌ను పోలీసులు బలవంతంగా నిర్బంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భజరంగ్ పూనియా సహా ఇతర రెజ్లర్లు పోలీసు అధికారుల నుంచి ఆమెను విడిపించేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ ఈ నిరసనల మధ్య ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవాలంటూ గత కొన్నాళ్లుగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -
Read Also:
1. సమాజమే దేవాలయంగా భావించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్: బాలకృష్ణ
2. కాలేయం సమస్యలు తొలగిపోవాలంటే ఈ జ్యూస్ తాగండి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...