గుజరాత్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 7 వ సారి రాష్ట్ర విధానాసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. రాష్ట్ర విధాన సభలో 182 స్థానల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 156 కాంగ్రెస్ 17 aap 5 ఇతరులు 4 స్థానాలను కైవసం చేసుకున్నారు.కాగా సూరత్ నగరంలోని 12 స్థానాలలోను బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. తెలుగు అభ్యర్థులు అధికంగా ఉన్న లింబాయత్ స్థానంలో శ్రీమతి సంగీత పాటిల్ 95,696 ఓట్లు సాధించి 58,009 ఓట్ల మెజార్టీని పొందారు. కాగా చోర్యాసి విధానసభ స్థానంలో బీజేపీ అభ్యర్థి శ్రీ సందీప్ దేశాయ్ 2,36,033 ఓట్లు సాధించి తమ సమీప అభ్యర్థి పై 1,86,418 ఓట్ల మెజారిటీ తో గెలుపొందరు.3 వ దఫా గెలుపొందిన శ్రీమతి సంగీత పాటిల్ గారికి నూతన మంత్రి వర్గంలో స్థానం లభించగలదని పలువురు భావిస్తున్నారు.
లింబాయత్, చోర్యాసి నియోజకవర్గాల ప్రాంతంలో గెలిచిన అభ్యర్థులు విజయ ర్యాలిని నిర్వహించారు,శ్రీమతి సంగీత పాటిల్ పోటీ చేసిన లింబాయత్ నియోజకవర్గంలో 44 అబ్యర్డులు పోటీ చేయగా అందులో అమ్ ఆద్మీ మినహాయించి మిగతా పార్టీల అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు,కాగా అందులో 33 మంది అభ్యర్థులు ముస్లింలు కావడం అందరి దృష్టిని ఆకర్షించింది. శ్రీమతి సంగీత పాటిల్ విజయ ర్యాలీ తెలుగువారున్న ప్రాంతాలైనా మందర్వాజ్,అంజన్,డుంబాల్, లింబాయత్ లో గల బీజేపీ తెలుగు నాయకులు రాపోలు బుచ్చిరములు,చిట్యాల రాములు,ఎనగందుల కవిత,తుమ్మ రమేష్,చిలక సురేష్,రాపోలు లక్ష్మి తదితరులు పాల్గొని స్వాగతం పలికారు. కాగా ఈ నెల 12 న ముఖ్యమంత్రితో పాటు నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారం గాంధీనగర్ లో జరగనుంది.సూరత్ నుండి గెలుపొందిన 12 మంది mla లలో హర్ష సాంగ్వి,పూర్ణేష్ మోడీ, వినోద్ మోరడియా, కిషోర్ కాశాని, శ్రీమతి సంగీత పాటిల్ కు అవకాశం లభించగలదని పలువురు భావిస్తున్నారు. కాగా సూరత్ నగరానికి చెందిన CR పాటిల్ గారు గుజరాత్ రాష్ట్ర అధ్యక్షునితో నూతన నవసరి లోకసభ సభ్యునిగా పని చేస్తున్న సమయంలో ఈ ఘనవిజయం సూరత్ ప్రజల విజయంగా పలువురు గర్విస్తున్నారు.