మందు బాబులకు న్యూ ఇయర్ కి పోలీసులు గుడ్ న్యూస్

మందు బాబులకు న్యూ ఇయర్ కి పోలీసులు గుడ్ న్యూస్

0
85

మందు తాగాలి అంటే ముచ్చటైన రోజు మంచి సుముహూర్తం అని చెబుతారు డిసెంబరు 31 ని , మందు అలవాటు లేనివాడు కూడా ఆ రోజు బీర్ తాగడమో, లేక ఒక బ్రీజర్ అయినా, లేదా ఒక పెగ్ అయినా తాగడం చేస్తారు. తాగను అన్న వాడు కూడా తాగుతూ తూలుతూ తేలుతూ ఇంటికి చేరుకుంటాడు, రోజూ రాత్రి పూట పోలీసులు బ్రీత్ అనలైజర్ తో మందుబాబులని పట్టుకుని వారికి ఫైన్లు వేస్తారు అనేది తెలిసిందే.

కాని డిసెంబర్ 31 న రాత్రి ఓ రెండు గంటలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం పట్టించుకోరు.తాజాగా బెంగుళూరు మెట్రో అధికారులు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. జనవరి 1న అర్ధరాత్రి 2 గంటల వరకు న్యూ ఇయర్ సందర్భంగా మెట్రో సర్వీస్లను ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నట్టు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

అంతేకాదు న్యూ ఇయర్ రోజు బ్రీత్ అనలైజర్ టెస్టును మినహాయిస్తున్నట్లు అధికారులు కీలక ప్రకటన చేసారు. దీనిపై మందుబాబులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై కొందరు విమర్శలు చేస్తున్నారు.. టెస్ట్ చేస్తుంటేనే రోజుకి వందల మంది దొరుకుతున్నారు, అదే టెస్ట్ లేదు అని పోలీసులు చెబుతున్నారు అంటే ఇక మందుబాబులు రెచ్చిపోతారని ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి అని కోరుతున్నారు అక్కడ జనం.