భారీగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర ఈ రోజు కాస్త స్ధిరంగా ఉంది.. రెండు మూడు రోజులుగా చూస్తే పుత్తడి ధరలు భారీగా పెరిగాయి.. కాని నేడు మాత్రం సాధారణంగానే ఉన్నాయి.. మరి బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి ఓసారి చూద్దాం.
హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,090 దగ్గర ట్రేడ్ అవుతోంది… 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.42,250 దగ్గర ఉంది..వెండి రేటు మాత్రం తగ్గింది. వెండి ధర రూ.300 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.69,700కు ట్రేడ్ అవుతోంది.
పుత్తడి వచ్చే రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉంది అంటున్నారు బులియన్ వ్యాపారులు… ఇక వెండి బంగారం ధరలు ఈనెలలో మరింత డౌన్ అవ్వచ్చు అంటున్నారు ..గత ఏడాది ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకూ చూస్తే బంగారం 11 వేల మేర తగ్గింది.